Ads
అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే కచ్చితంగా మందులు వాడాలి. అయితే మందుల్లో జనరిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. అసలు జనరిక్ మెడిసిన్స్ అంటే ఏమిటి..? ఎందుకు ఇవి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి..? చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే మరి దాని కోసం చూసేద్దాం.
Video Advertisement
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం జనరిక్ మెడిసిన్స్ ని కనుక డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేశారంటే 70 శాతం వరకూ డబ్బులు తగ్గుతాయి.
కానీ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, మెడికల్ స్టోర్స్ మరియు డాక్టర్ల ఆశ వల్ల జనరిక్ మందులు ఎక్కువగా తీసుకు రావడం లేదు. బ్రాండెడ్ మందుల కంటే కూడా జనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరకే మనకి అందుబాటులో ఉంటాయి.
అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి..?
Also Read: బీపీతో బాధపడుతున్నారా..? అయితే మందులు లేకుండా ఇలా కంట్రోల్ చేసుకోండి..!
జనరిక్ మందుల కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది. అందుకనే బ్రాండెడ్ మందుల లాగే పనిచేస్తాయి.
అలానే బ్రాండెడ్ మందుల లాగే జనరిక్ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
అందులో ఉండే పదార్థాలు ఇందులో కూడా వాడుతూ ఉంటారు.
ఇవి మార్కెట్ లోకి రావాలంటే అనుమతి అవసరం. అలానే లైసెన్సు కూడా ఉండాలి. బ్రాండెడ్ మందులకి కూడా ఇవి అవసరం.
ఈ మందులుకి కూడా బ్రాండెడ్ మందుల లాగే క్వాలిటీ చెకింగ్ కూడా ఉంటుంది.
వీటి యొక్క ధర ఎందుకు తక్కువ ఉంటుందంటే..?
ఎలా పడితే అలా వీటి ధరని పెట్టడం అవ్వదు. ప్రభుత్వం వీటికీ ఇంత ధర అని పెడుతుంది.
బ్రాండెడ్ మందులతో పోలిస్తే ధర విషయంలో అయిదు నుండి పది రెట్లు తేడా ఉంటుంది.
కంపెనీలు వేరు వేరు లేబరేటరీలో రీసెర్చ్ చేయక్కర్లేదు. దీనితో తక్కువ డబ్బే పడుతుంది.
అలానే జనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ల మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ధర తక్కువగా ఉంటుంది.
అడ్వర్టైజ్మెంట్లు చేసి డబ్బుని వేస్ట్ చెయ్యరు. అందుకే తక్కువ ధరకే అమ్ముతాయి.
Also Read: అబ్బాయిలూ.. ఊరగాయలు ఎక్కువగా తింటున్నారా..? దాని వల్ల వచ్చే సమస్యలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు..!
End of Article