బప్పీలహరి మరణానికి కారణమైన స్లీప్ అప్నియా గురించి తెలుసా..? మాములుగా కనిపించే ప్రాణాంతక వ్యాధి..

బప్పీలహరి మరణానికి కారణమైన స్లీప్ అప్నియా గురించి తెలుసా..? మాములుగా కనిపించే ప్రాణాంతక వ్యాధి..

by Anudeep

Ads

ఇటీవల టాప్ మ్యూజిక్ ఐకాన్ బప్పీలహరి అస్తమించడంతో భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా ఆయన అలనాటి స్టార్ హీరోలు చిరు, బాలయ్య, కృష్ణ, మోహన్ బాబు వంటి వారికి బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. అయితే.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియానే కారణమని వైద్యులు తెలిపారు.

Video Advertisement

అసలు స్లీప్ అప్నియా అంటే ఏంటి..? ఎలాంటి లక్షణాలు ఉంటె స్లీప్ అప్నియాగా పరిగణిస్తామో ఇపుడు తెలుసుకుందాం. నిద్రలో ఉన్నపుడు శ్వాసని ఆగి ఆగి తీసుకోవడాన్ని స్లీప్ అప్నియాగా పరిగణిస్తాం.

sleep apnea 3

స్లీప్ అప్నియాలోనే మూడు రకాలు ఉంటాయి. అవి అబ్ స్ట్రక్టివ్ స్లీప్​ అప్నియా, సెంట్రల్​ స్లీప్​ అప్నియా, కాంప్లెక్స్​ స్లీప్​ అప్నీయా. చాలా మంది స్లీప్ అప్నియా ను సాధారణంగా వచ్చే జబ్బే అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత సాధారణమో అంత ప్రాణాంతకం కూడా. ఈ వ్యాధి వున్న వారు నిద్ర సమయంలో శ్వాస ఆడక ఇబ్బంది పడతారు.

sleep apnea 1

ఆగి ఆగి శ్వాస తీసుకోవడం వల్ల మెదడు నిద్ర లేచి శ్వాస తీసుకోవాలి అంటూ సంకేతాలు పంపిస్తుంది. దీనితో వీరు సరిగా నిద్ర పోలేకపోతూ ఉంటారు. సాధారణంగా ఈ వ్యాధి ఉన్న వారికి నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునే ఎగువ భాగంలో గాలి బ్లాక్ అయిపోతుంది. దీనితో గాలిని ఊపిరితిత్తులలోకి బలంగా పంపించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఛాతీకండరాలు బలంగా పని చేస్తుంటాయి. దీనితో ఎక్కువ శబ్దం చేస్తూ గాలి తీసుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా.. చాలా మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది.

sleep apnea 2

ఊబకాయం ఉన్న వారు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. శ్వాస నాళ కండరాలు మూసుకు పోవడం వలన ఈ స్లీప్ అప్నియా సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్న వారు పెద్దగా గురక పెడతారు. పగటిపూట ఎక్కువ నిద్రపోతుంటారు. ఉలిక్కి పడి నిద్ర లేవడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండడం వంటివి చేస్తుంటారు. నిద్రలో మెలకువ వస్తుండడం వలన మతిమరుపు, చిరాకు, నిద్రమబ్బుతనం వంటివి అనిపిస్తూ ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉన్నవారు, షుగర్ పేషంట్లు ఎక్కువగా దీనిబారిన పడుతుంటారు.


End of Article

You may also like