ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ గురించి అందరికి తెలుసు.. మరి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఈ తాజ్ మహల్ గురించి తెలుసా..?

ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ గురించి అందరికి తెలుసు.. మరి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఈ తాజ్ మహల్ గురించి తెలుసా..?

by Anudeep

Ads

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాజహాన్ తనకి ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ తాజ్ మహల్ నిర్మించారు. వేరే దేశంలో ఉన్న వాళ్లకు కూడా భారతదేశం అంటే టక్కున గుర్తుకు వచ్చేది తాజ్ మహల్.

Video Advertisement

తాజ్ మహల్ ఎక్కడ ఉంది అంటే.. టక్కున ఆగ్రాలో ఉంది అని చెప్పేస్తారు ఎవరైనా. అయితే.. చాలా మందికి తెలియనిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక తాజ్ మహల్ ఉంది అని. ఏపీలో వైజాగ్ లో ఉన్న ఈ తాజ్ మహల్ గురించి చాలా మందికి తెలియదు.

vizag tajmahal 1

వైజాగ్ బీచ్ కు దగ్గరగా ఉండే ఈ కట్టడం నిర్మాణ శైలి భిన్నంగా ఉండడంతో ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని ఓ జమీందారు తన భార్యకి గుర్తుగా కట్టించారు. ఆమె మరణానంతరం ఈయన అక్కడే చాలా కాలం గడిపి చనిపోయారు. ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలియాలంటే అసలు వీరెవరో తెలుసుకోవాలి. కురుపాం జమీందారు రాజా వైరిచెర్ల వీరభద్ర బహదూర్‌కు అనకాపల్లి జమీందారు గోడే నారాయణ గజపతిరావు రెండవ కుమార్తె రాణి లక్ష్మీ నరస్సాయమ్మ పట్టమహాదేవిను ఇచ్చి 1895 లో పెళ్లి చేసారు. వివాహమైన ఏడేళ్ళకే ఆమె మరణించారు.

vizag tajmahal 2

ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత ఆమె మరణించడంతో రాజా వీరభద్ర బహదూర్ తట్టుకోలేకపోయారు. ఆమె ప్రేమని, ఆమె జ్ఞాపకాలని ఆయన మర్చిపోలేకపోయారు. రాజావారు నిరంతరం రాణి వారి జ్ఞాపకాలతో గడిపేస్తూ ఆమెకోసం ఓ మందిరాన్ని కట్టించారు. దీని నిర్మాణ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. రాజా వారు రాణి వారు బతికి ఉన్న సమయంలోనే చాలా ప్రాంతాలను పర్యటించారు. ఆయా ప్రాంతాల సంస్కృతులు సంప్రదాయాలపైనా ఆయనకు అవగాహన ఉంది. ఆయన జమీందారుగా ఉన్న కాలంలో మొఘలులు రాజ్య పాలన చేసేవారు.

vizag tajmahal 3

దీనితో ఈ నిర్మాణ శైలిలో మొఘలుల నిర్మాణ శైలితో పాటు భిన్న ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు గోచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరు ఈ మందిరాన్ని వైజాగ్ తాజ్ మహల్ అని చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవానికి దీనికి రాజా బహదూర్ పెట్టిన పేరు “ప్రేమ నివేదన రూపం”. రాణి వారి మరణాన్ని జీర్ణించుకోలేని రాజా బహదూర్ ఆయన మరణించే వరకు ఈ ప్రేమ నివేదన రూపం మందిరంలోనే గడిపారు.

Also Read:   “మేము సంతోషంగా బతకడం ఇష్టం లేదా…?” జానకి కలగలేదు హీరో “అమర్‌దీప్‌” కామెంట్స్..!

vizag tajmahal 4

ఈ మందిరంలో సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా గోడలు చెక్కబడి ఉన్నాయి. ఈ మందిరంలో రాణి వారి పెద్ద విగ్రహం ఉండేది. రాణి పట్టమహిదేవి విగ్రహాన్ని చెక్కించిన తరువాత విశాఖ సాగర తీరానికి దగ్గరగా కురుపాం జమీందార్ల స్థలంలో ఈ భవన నిర్మాణం చేపట్టబడింది. అయితే.. ముప్పయ్యేళ్ల క్రితం వరకు దీని వైభోగం బానే ఉండేది. కానీ, ఓ 30 ఏళ్ల క్రితం రాణి పట్టమహిదేవి విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. దీన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో చుట్టూ పొదలు, గుట్టలు పెరిగిపోయాయని హెరిటేజ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ సభ్యులు ఎడ్వార్డ్ పాల్ తెలిపారు. చుట్టూ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చేయడంతో దీనిని పట్టించుకునేవారు తక్కువయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.

vizag tajmahal 5

ఇది విశాఖ బీచ్ కు దగ్గరగా ఉంటుంది. అయితే దీని గురించి చాలా మందికి తెలియకపోవడం వలన ఈ ప్లేస్ కి వచ్చే టూరిస్ట్ ల సంఖ్యా తక్కువగానే ఉంది. ఇది నిర్మాణంలో తాజ్ మహల్ ని పోలి ఉండదు. కానీ, ఇది కూడా ప్రేమకు చిహ్నంగా నిర్మించబడడం వల్లే దీనిని వైజాగ్ తాజ్ మహల్ అని పిలుస్తుంటారు. ప్రేమికుల దినోత్సవ సమయంలో మాత్రం కొందరు ప్రేమికులు మాత్రం దీనిని సందరిస్తూ ఉంటారు. ఈ భవనంపై చెక్కిన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ మందిర గోడలపై కొన్ని తెలుగు, ఇంగ్లీష్ కవితలు కూడా ఉండేవి. ప్రస్తుతం ఇవి కనిపించట్లేదని పాల్ చెబుతున్నారు. ఇది ప్రైవేట్ ఆధీనంలోనే ఉందని.. తిరిగి దీనికి పూర్వ వైభవం సంభవించాలంటే కురూపం జమిందారీ వారసులే పూనుకోవాలని ఎడ్వర్డ్ పాల్ అభిప్రాయపడ్డారు.

Also Read:  నిజమైన ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియాలంటే… ఈ కథ తప్పక చదవాల్సిందే..!


End of Article

You may also like