పెద్ద పెద్ద హోటల్స్ లో చెఫ్స్ ఇలాంటి టోపీలను ఎందుకు పెట్టుకుంటారు..? అసలు కారణం ఇదే..!

పెద్ద పెద్ద హోటల్స్ లో చెఫ్స్ ఇలాంటి టోపీలను ఎందుకు పెట్టుకుంటారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మీరెప్పుడైనా గమనించారా..? పేరు మోసిన హోటల్స్ లో వంట చేసే చెఫ్ లు విధిగా తెల్లని టోపీలను వారి యూనిఫామ్ లో భాగంగా ధరిస్తూ ఉంటారు. అసలు ఇవి ఎందుకు పెట్టుకుంటారు..? అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..? వీటివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

ప్రతి హోటల్ లోను వంటకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. వంట టెక్నిక్ ల నుంచి యూనిఫామ్ వేసుకునే శైలి వరకు ప్రతి హోటల్ కి భిన్నమైన నియమాలు ఉంటాయి.

chef 1

అన్ని హోటల్స్ లో ఉండే కామన్ విషయం ఏంటంటే.. ఈ చెఫ్ లు తెల్లని పొడవైన టోపీలను ధరించడం. అసలు ఈ టోపీలు ఎందుకు ధరిస్తారు..? ఈ టోపీలు సైజులు ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి..? అన్న సంగతి చూద్దాం. టోపీ ఎత్తు వంటగదిలోని చెఫ్ యొక్క పొజిషన్ ను సూచిస్తుంది. ఎక్కువ పొజిషన్ కలిగి ఉన్న చెఫ్ పొడవైన టోపీలను ధరిస్తూ ఉంటారు.

chef 2

ఈ సంప్రదాయం 1800ల ప్రారంభంలో ఫ్రాన్స్‌లో పురాణ చెఫ్ మేరీ-ఆంటోయిన్ కారేమ్ తన చెఫ్‌లకు యూనిఫాం ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభమైంది. అతను తెలుపు రంగును ఇష్టపడే రంగుగా ఎంచుకున్నాడు, ఎందుకంటే ఇది శుభ్రతను సూచిస్తుంది మరియు అతని వంటగది సిబ్బంది అందరూ వేర్వేరు ర్యాంక్‌లను సూచించే వివిధ ఎత్తులతో కూడిన టోపీ ధరించాలని రూల్ పెట్టారు.

chef 1

 

అసలు ఇలా టోపీలు ధరించడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. వంట చేసేటప్పుడు పొరపాటున వెంట్రుకలు ఆహరంలో పడితే.. తినే సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అన్న కారణంతో వంట చేసేవారు తమ హెయిర్ ని టోపీతో కప్పుకుంటారు. అప్పుడు వెంట్రుకలు ఆహారంలో కలిసే అవకాశం ఉండదు.


End of Article

You may also like