Ads
సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వారికి ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటిల్లో రెటినోపతి సమస్యలు కూడా ఉన్నాయి. టైప్ 1 లేదా టైప్ 2 .. ఏ డయాబెటిస్ ఉన్న వారికి అయినా రెటినోపతి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
Video Advertisement
చాలామందికి డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ లక్షణాలు కనిపించవు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి సమగ్రమైన కంటి పరీక్షను చేయించుకోవడం వలన కంటి పరీక్షను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
రక్తంలో పెరిగిన చక్కర స్థాయి కంటి సమస్యల్ని తెచ్చి పెడుతుంది. ఫలితంగా అస్పష్టమైన దృష్టి, చూపులో హెచ్చుతగ్గులు, కొన్ని సార్లు పూర్తిగా దృష్టి కోల్పోవడం కూడా జరుగుతుంది. అసాధారణంగా రక్తనాళాలు పెరుగుతుండడం కూడా రెటినోపతి కి కారణం కావచ్చు. రెటినోపతి కారణంగా ఈ మూడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
గ్లాకోమా:
కంటి ముందు భాగంలో కొత్త కొత్త రక్తనాళాలు పెరగడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నాళాలు కంటి లోని ద్రవ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. దీనినే ఐరిస్ అని పేర్కొంటారు. ఇది కంటిలో ఒత్తిడిని కలిగించి ఆప్టిక్ నాడిని దెబ్బ తీస్తుంది. తద్వారా చూపు దెబ్బతింటుంది.
రెటినాల్ డిటాచ్మెంట్:
డయాబెటిక్ రెటినోపతి వలన ఏర్పడే అసాధారణ రక్తనాళాలు మచ్చ కణజాలాల పెరుగుదలని పెంచుతాయి. ఇవి రెటినాని కంటి నుంచి దూరంగా లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీనివలన కూడా చూపు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
అంధత్వం:
మాక్యులార్ ఎడెమా, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలు లేదా… ఈ మూడింటి కలయిక వలన కూడా పూర్తి అంధత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
End of Article