Ads
చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగనిదే తెల్లారదు. ఫ్రెష్ గా కాఫీ/టీ తాగిన తరువాతే వారి దినచర్యని ప్రారంభిస్తారు. అయితే.. ఆరోగ్యానికి ప్రాముఖ్యతని ఇచ్చే చాలా మంది తమ ఉదయాలను వేడి నీటిలో తేనే నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా ప్రారంభిస్తారు.
Video Advertisement
చాలా మంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా తమ బరువుని అదుపులో ఉంచుకోవడం కోసం ఈ డ్రింక్ ని తాగుతూ ఉంటారు. కానీ, బరువు తగ్గడం ఒక్కటే కాదు.. ఈ తేనే నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
1. ఐరన్, సోడియం, కాల్షియమ్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు తేనెలో పుష్కలంగా లభిస్తాయి.
2. ముదురు రంగులో ఉండే తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
3. ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఇలా తేనే నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య పూర్తిగా పోతుంది. గుండెల్లో మంట కూడా తగ్గుముఖం పడుతుంది.
4. అలాగే.. మద్యం తాగిన వారికీ మరుసటి రోజు వచ్చే హ్యాంగ్ ఓవర్ ని తగ్గించడానికి కూడా తేనే ఎంతగానో దోహదం చేస్తుంది.
5. చెంచా తేనెకి చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు తగ్గుముఖం పడుతుంది.
6. అలాగే అరచెంచా దాల్చిన చెక్క పొడికి, చెంచా తేనే కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇంకా ఇతర పంటి సమస్యలు ఏమైనా ఉన్న అవి కూడా తగ్గుతాయి.
7. అలాగే అధరాలు పగులుతూ ఇబ్బంది పడుతున్నవారు కొంచం పంచదారకు తేనే కలిపి సున్నితంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. తేనే, గులాబీ నీరు వంటి వాటిలో వ్యాధి నిరోధక గుణాలు ఉంటాయి. ఇవి శరీరం పై ఉండే మచ్చలను దూరం చేసి చర్మానికి కాంతిని తీసుకొస్తాయి.
End of Article