Ads
చాలా మంది భర్తలు తమ భార్యలని తక్కువ అంచనా వేస్తుంటారు. వారికేమీ తెలియదని.. ఇంట్లో పనులు తప్ప ఇంకేమీ పట్టవని అనుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని అలుసుగా చేసుకుని కొన్ని కొన్ని సార్లు హేళన చేయడం, సెటైర్లు వేయడం వంటివి చేస్తుంటారు.
Video Advertisement
ఓ భర్త కూడా ఇలానే తన భార్యకి హితబోధ చేద్దాం అని అనుకున్నాడు. కానీ, అంతలోనే భార్య ఇచ్చిన షాక్ కి అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఇంతకీ అసలు విషయం ఏంటో చూడండి.
రష్యాకి-ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఉక్రెయిన్ పై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. దాదాపు అన్ని మీడియా కవరేజీలు, వార్తాపత్రికలు ఇవే వార్తలను రాశాయి. ఈ వార్తలని అన్ని తెగ చదివేసిన ఆ భర్త రష్యా తీరుపై ఆగ్రహం తెచ్చుకున్నాడు. అంతే కాకుండా.. ఆ పాండిత్యం అంతా తన భార్య ముందు చూపించి ఫోజు కొట్టాలనుకున్నాడు. తన భార్యకు ఈ రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న గొడవలు, రష్యా తీరుపై అసహనం అన్ని విసుక్కుంటూ చెప్పాడు.
అయితే.. అప్పటిదాకా ఇంట్లో పనులు చేసి వచ్చి.. అలసి పోయిన ఆ భార్య తన కొడుక్కి దుప్పటి కప్పి సైలెంట్ గా వచ్చి పడుకుంది. భార్య ఏమి మాట్లాడకపోయేసరికి ఆ భర్త మరింతగా రెచ్చిపోయి చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రేపటికి చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తోంది. దీనితో విసుగు చెందిన ఆ భర్త అందుకే టీవీ లో న్యూస్ చూడాలి, పేపర్లు చదవాలి.. ఎంతసేపు తిన్నామా, పడుకున్నామా అన్నట్లు ఉండకూడదు అంటూ హేళన చేసాడు. మన చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోవాల్సిన పని లేదా అంటూ మరింత రెచ్చిపోయాడు. తనమీద తనకి నమ్మకం ఏంటంటే తనకి అన్ని విషయాలు తెలుసనీ, తన భార్యకి ఏమీ తెలియదు ఒట్టి మొద్దు అని నమ్మకం.
ఇంకా చెడామడా తిడుతూనే ఉండగా.. కొంతసేపటికి విసుగొచ్చిన ఆ భార్య లేచి వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ ఓ కత్తి తీసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి భర్త వైపు అదోలా చూసి ఇంక పడుకోండి అని చెప్పి కత్తిని పక్కన పెట్టి పడుకుంది. దీనితో ఆ మొగుడికి టెన్షన్ మొదలవుతుంది. భయం వేస్తూ ఉంటుంది. అంత పెద్ద కత్తి తెచ్చుకుని నీ పక్కన పెట్టుకుని పడుకుంటే.. నీ దగ్గర ఎలా పడుకుంటా..? అంటూ భార్యని భయంగా ప్రశ్నిస్తాడు. మీ సొంత భార్యని అయినా నేనే చిన్న కత్తి తెచ్చి పడుకుంటే మీకు నిద్ర పట్టట్లేదు.. మరి నాటోతో చేతులు కలిపి, అమెరికాతో ఫ్రెండ్ షిప్ చేస్తూ.. పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ ను చూసి రష్యా ప్రశాంతంగా ఎలా ఉంటుంది? అంటూ ఒక్క డైలాగ్ తో భర్త నోరు మూయించింది. ఇక ఆ భర్తకి మాటల్లేవు.. సైలెంట్ గా పడుకోవడం తప్ప. అందుకే చెప్పేది.. భార్యలని ఎప్పుడూ తక్కువగా అంచనా వెయ్యకూడదు.
Note: Images used in this article are for reference purposes only. They are not the actual characters.
End of Article