ప్రేమలో విఫలం అయ్యారా..? అయితే ఈ 3 తప్పులు అస్సలు చేయకండి..!

ప్రేమలో విఫలం అయ్యారా..? అయితే ఈ 3 తప్పులు అస్సలు చేయకండి..!

by Anudeep

Ads

సాధారణం గా మన ప్రేమను మనం ప్రేమించిన వారు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతాం. కానీ, మనలని కూడా అంతే గొప్ప గా ప్రేమించే వారు దొరకడం మన అదృష్టం. కానీ.. ఈ అదృష్టం అందరిని వరించదు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ విఫలం అవుతూ ఉండచ్చు కూడా.. ప్రేమలో విఫలం అవ్వడం అనేది బాధాకరమైన విషయమే.

Video Advertisement

ఆ గుండె కోతని భరించడం అంత తేలిక కాదు. మనం ప్రేమించిన వాళ్ళు మన ప్రేమని అంగీకరించకపోయినా, మనలని పట్టించుకోకపోయినా ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం. కానీ, వారితో మాట్లాడలేం.

చెప్పలేని బాధని అనుభవిస్తూ ఉంటాం. అయితే.. ప్రేమ విఫలం అయినా.. మీ పార్ట్ నర్ తో మీకు బ్రేక్ అప్ అయినా ఈ తప్పులను పొరపాటున కూడా చేయవద్దు. దాని వలన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ తప్పులేంటో చూద్దాం.

#1 పాత మాటలు తలుచుకోవడం:

ఒకసారి బ్రేక్ అప్ అయిపోయాక… వారితో గతంలో మాట్లాడిన మాటలు తలుచుకోవడం, చాటింగ్ లో మెసేజ్ లను చదువుకోవడం వంటివి చేయవద్దు. ఫోన్ లో వారి జ్ఞాపకాల తాలూకు ఫోటోలు ఉన్నా, వాటిని తీసేయడం మంచిది.

#2 స్నేహితుల్లా ఉండొద్దు:

చాలా మంది ప్రేమలో విఫలం అయ్యాక స్నేహితుల్లా విడిపోదాం అనుకుంటారు. కానీ, ఇది సాధ్యం కాదు. గతాన్ని మరిచిపోయి స్నేహితులలా ఉండడం అనేది సాధ్యం కాని పని. వారితో చనువుగా ఉండలేక స్నేహాన్ని కొనసాగించడం కష్టమైనా పనే. కాబట్టి ఈ తప్పు కూడా చేయకండి.

breakup 1

#3 వారి ప్రొఫైల్ ను చెక్ చేయవద్దు:

మీరు ప్రేమించిన వారు దూరం అయ్యాక పదే పదే వారి ప్రొఫైల్ ను చెక్ చేయడం వంటి పనులు చేయకండి. దాని వల్ల మీకు మరింత బాధ కలుగుతుంది. అంతే కాదు, వారిని మర్చిపోవడం కూడా సాధ్యం అయ్యేపని కాదు.


End of Article

You may also like