Ads
మనలో ఎక్కువ శాతం మంది ఎదుర్కునే ఆరోగ్య సమస్యల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఒకటి. అందులోనూ ముఖ్యంగా గుండెపోటు. ఈ గుండెపోటు తీవ్రత మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. కొంత మందికి అధికంగా వస్తే కొంత మందికి మామూలు గుండెపోటు వస్తుంది. చిన్న చికిత్స ద్వారా ఇది నయమవుతుంది.
Video Advertisement
కానీ ఒకసారి గుండెపోటు వచ్చిందంటే తర్వాత ఆహార విషయాల్లోనూ, అలాగే ఆరోగ్య సంబంధిత విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణం ఒత్తిడి ఎక్కువ అవ్వడం, అలాగే వయసు సంబంధిత సమస్యలు. అంతే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా గుండెపోటు తీవ్రతకి ఒక కారణం అవుతుంది.
అయితే మనకి హార్ట్ ఎటాక్ వచ్చే ముందే మనకి తెలిసిపోతుంది. మన చెయ్యి కొన్ని సంకేతాల ద్వారా మనకి సూచనలు పంపుతూ ఉంటుంది. ఎడమ వైపు ఉన్న చెయ్యి పదే పదే లాగుతున్నట్లు ఉండడం, విపరీతంగా నొప్పి అనిపిస్తుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే అవి హార్ట్ ఎటాక్ కి సంకేతంగా భావించాలి. కొంతమందికి రెండు చేతులు, రెండు భుజాలు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. ఇలా అనిపించినప్పుడు ఆలస్యం చేయకూడదు.
ఇంకా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే మరికొన్ని లక్షణాల గురించి చెప్పుకుందాం. ఛాతి నొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపించడం, ఉన్నట్లుండి నీరసంగా అనిపించడం, ఛాతీ మొత్తం పట్టేసినట్లు అనిపిస్తే మాత్రం ప్రమాదమే.. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత మొదటి గంట కాలాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ టైం లో ప్రధమ చికిత్స ద్వారా పేషెంట్ ను రక్షించవచ్చు. రోగిని వెల్లకిలా పడుకోబెట్టి ఛాతీ పై సిపిఆర్ చేయాలి. రెండు చేతులతో గుండెపై గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. కనీసం 15 సార్లు పాటు అయినా ఆగకుండా వత్తాలి. నోటిద్వారా కృత్రిమ శ్వాస అందించాలి. అంబులెన్స్ వచ్చేవరకు ఇలా చేయడం వలన ప్రాణం పోకుండా.. గుండె ఆగిపోకుండా కాపాడవచ్చు.
End of Article