Ads
చాలా మందికి ఎదురవుతున్న సమస్య గ్రే హెయిర్. ప్రస్తుతం చాలా మంది యువతలో కూడా కనిపించేస్తోంది. చాలా కాలం వరకు మనుషుల్లో ఈ ఇబ్బంది లేదు. కనీసం 40 ఏళ్ళు దాటాకే తెల్ల జుట్టు వచ్చేది. కానీ.. ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే ఈ సమస్య ఎదురవుతోంది.
Video Advertisement
కొంతమందికి టీనేజీ వయసు కూడా దాటకుండానే వచ్చేస్తోంది. బాల నెరుపు అని పేర్కొంటూ ఉంటారు దీనినే. మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, విపరీతమైన ఒత్తిడిలు కూడా ఒక కారణం.
మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వలన మీరు మళ్ళి నల్లని జుట్టుని పొందవచ్చు.
ఇంటి చిట్కాల వలన చిన్నతనంలో వచ్చే తెల్లని జుట్టుని నివారించి చాల వొతైన బలమైన జుట్టుని పొందవచ్చు. బయట మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారు అవుతుంది. అందువలన ఇంటి చిట్కాలు ఉపయోగించడం వలన మీ జుట్టు చాల వొత్తుగా నల్లగా అందంగా తయరుఅవుతుంది.
మీ ఇంట్లోనే సహజ సిద్ధంగా ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి, ఒక మందపాటి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ను పెట్టుకోవాలి. అవి బాగా మరిగిన తరువాత అందులో ఒక స్పూన్ లవంగాల పొడి, రెండు స్పూన్ల మెంతిపొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసి మరింత మరిగించాలి. ఒక ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆపేసి ఆ వాటర్ ను చల్లారనివ్వాలి. తరువాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. మరో బౌల్ లో ఐదు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ పుల్లని పెరుగు, ఫిల్టర్ చేసుకున్న వాటర్ ను కలుపుకుంటూ ప్యాక్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి ఒకసారి జుట్టు కుదుళ్ళ నుంచి వేసుకుంటే తెల్లగా ఉన్న జుట్టు క్రమంగా నల్లబడి, చుండ్రు వంటి సమస్యలు కూడా మాయం అవుతాయి.
End of Article