ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల ఎంట్రన్స్ లో ఇలాంటి ఇనుప చువ్వలు ఎందుకు ఉంటాయి..? 

ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల ఎంట్రన్స్ లో ఇలాంటి ఇనుప చువ్వలు ఎందుకు ఉంటాయి..? 

by Anudeep

Ads

మీరెప్పుడైనా గమనించారా..? ఇండియాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు వెళ్లే దారిలో ఇటువంటి ఇనుప చువ్వలు పేర్చబడి ఉంటాయి. ఇవి ఇనుప పైపుల్లా ఉండి, కదులుతూ ఉంటాయి. వీటిపై వాహనాలు రావడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

Video Advertisement

అసలు ఇలాంటి ఇనుప రాడ్ లను పెట్టడం ఎందుకు..? మాములుగా రోడ్ లాంటి మార్గాన్ని వేయచ్చు కదా..? మీకెప్పుడైనా ఇలాంటి సందేహం కలిగిందా..? అయితే వెంటనే ఈ ఆర్టికల్ చదివేయండి.

iron rods 1

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, కార్యాలయాలు కానీ విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంటాయి. ఈ ప్రాంగణంలో మొక్కలు, చెట్లు పెంచుతూ ఉంటారు. సహజంగానే అటువంటి ప్రదేశాలలో తిరగడానికి కుక్కలు, పందులు, గేదెలు వంటి జంతువులు వస్తూ ఉంటాయి. అయితే.. ఈ జంతువులను అడ్డుకోవడం కోసమే ఈ ఇనుప పైపులను ఆ విధంగా పేర్చుతారు.

iron rods 2

వీటిని క్యాటిల్ గ్రిడ్ అని పిలుస్తూ ఉంటారు. కింద కాలువలా తవ్వి దాని పైన ఇనుప పైపులను ఒకదాని పక్కన ఒక్కటి పేర్చుతారు. ఇలా చేయడం వలన దీనిపై జంతువులు నడిచి రాలేవు. జంతువుల కాలి గిత్తలు మనుషుల పాదాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిపై నడిచి రావాలంటే జంతువుల గిత్తలు అందులో చిక్కుకుపోతూ ఉంటాయి. అవి లోపలకి రావడాన్ని అడ్డుకోవడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తారు.


End of Article

You may also like