Ads
మీరెప్పుడైనా గమనించారా..? కోన్ ఆకారంలో ఉన్న బారికేడ్లలా కనిపిస్తున్న జండాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..? నిజానికి ఈ జండా ఎయిర్ పోర్ట్ వద్ద కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జండాలని ఎందుకు పెడతారో.. దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Video Advertisement
ఈ వస్తువులను పారిశ్రామిక విండ్సాక్స్ లేదా “విండ్ కోన్స్” లేదా కొన్నిసార్లు “ఎయిర్ కోన్స్” అని పిలుస్తారు. ఇది సింథటిక్ క్లాత్, నైలాన్ లేదా రబ్బరుతో తయారు చేయబడిన ఒకరకమైన గొట్టం లాంటి నిర్మాణం.
ఇది ఒక చివర గట్టి మెటల్ రింగ్ ద్వారా తెరిచి ఉంటుంది. ఎయిర్‌ఫీల్డ్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు మరియు హెలిపోర్ట్లలో ఈ జండాలు అమర్చబడి ఉంటాయి. ఈ కోన్ ఆకారంలో ఉన్న జండాలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పైలట్‌కు గాలి దిశ మరియు సుమారుగా గాలి వేగం గురించి వేగంగా సూచనను అందించగలగడం. పైలట్లు టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో గాలి వేగాన్ని లెక్కించుకోవాల్సి ఉంటుంది. విమానం సురక్షితంగానే ల్యాండ్ అవుతోందని, లేదా టేక్ ఆఫ్ అవుతోందని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
ఆ సమయంలో పైలట్లు ఈ జండాలను పరిశీలించి.. గాలి ఏ దిశ వైపు వీస్తోంది లేదా ఎంత వేగంగా వీస్తోంది అన్న విషయమై ఒక అంచనాకి వస్తుంటారు. అందుకే విమానాశ్రయాల్లో ఈ జండాలు కీలక పాత్ర పోషిస్తాయి. విమానం టేకాఫ్ లేదా రన్‌వేపై ఆగిపోయే ముందు భూమిపై ప్రయాణించాల్సిన దూరాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. టేకాఫ్‌కు ముందు వేగవంతం చేసే ముందు, పైలట్లు రన్‌వేపై షికారు చేస్తున్నప్పుడు దాన్ని త్వరగా పరిశీలించి, అవసరమైన ఇన్పుట్ను అందిస్తారు.
End of Article