Ads
మండుతున్న వేసవి నుంచి ఉపసమనం పొందడానికి చాలామంది ఈసీజన్ లో పుచ్చుకాయ ముక్కలను ఇష్టపడతారు.వేసవికాలంలో ఎండల్లో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది.
Video Advertisement
అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.
అయితే.. చాలా మంది సమ్మర్ రాగానే ముందు చేసే పని పుచ్చకాయలు కొనడం. ఇవి మార్కెట్ లో కొని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, చల్లగా అయిన తరువాత తింటూ ఉంటారు. అయితే.. ఈ పుచ్చకాయలు ఎంపిక చేసుకోవడం అంత తేలిక అయిన విషయమేమీ కాదు. పుచ్చకాయ బయటినుంచి చూడడానికి బాగానే ఉన్నా.. ఒక్కోసారి ఇంటికి తీసుకొచ్చి కోసిన తరువాత అంత ఎర్రగా ఉండకపోవచ్చు.
బాగా ఎర్రగా పండిన కాయలు అయితే ఎక్కువ రుచికరంగా ఉంటాయి. పుచ్చకాయలు ఎంచుకునేటప్పుడు వాటిని కట్ చేయకుండానే ఎర్రగా ఉండే కాయలను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయ ఎంచుకునేటప్పుడు అది ప్లైన్ గా ఉన్నా, లేక దానిపై చారలు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. తొడిమ భాగంలో మాత్రం గట్టిగా ఉందో లేదో చూసుకోవాలి. పుచ్చకాయ కూడా గట్టిగా, బరువుగా ఉందో లేదో చూసుకోవాలి. కాయ మెత్తగా ఉందంటే అది పాడైపోయిందని అర్ధం.
అయితే.. పుచ్చకాయ పై ఉండే చారలతో సంబంధం లేకుండా గుండ్రని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటె.. లోపలి కాయ అంత ఎర్రగా పండిందని అర్ధం. ఎంత ఎక్కువ ఎర్రగా ఉంటె.. అన్ని ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే కొనేముందు తొడిమ ఎండిందో లేదో చూసుకోవాలి. ఈ పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో లేదా ఎండ తగలని ప్రదేశాలలో ఉంచితే పాడవకుండా ఉంటుంది.
ఈ చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి. ఈసారి మీరు పుచ్చకాయ కొనుక్కునేటప్పుడు ఈ టిప్స్ తో మంచి పుచ్చకాయలు ఎంచుకోండి. పుచ్చకాయని కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం కంటే.. కట్ చేయకుండానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని.. తినేముందు కట్ చేసుకుని చల్లగా తినడం మంచిది. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
End of Article