చాణక్య నీతి: చేతికి డబ్బు అందింది కదా అని ఈ పనులు అస్సలు చేయకండి.. ఒకవేళ చేస్తే..?

చాణక్య నీతి: చేతికి డబ్బు అందింది కదా అని ఈ పనులు అస్సలు చేయకండి.. ఒకవేళ చేస్తే..?

by Anudeep

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు.

Video Advertisement

వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. అలాగే డబ్బు సంపాదన విషయమై కూడా చాణక్య నీతి మనకు చాలా విషయాలను నేర్పిస్తుంది.

డబ్బుని అభిమానించని వారు ఎవరు ఉంటారు..? అందరికి ఆశ ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొందితే సంపదలు సిద్ధిస్తాయి అని విశ్వసిస్తూ ఉంటారు. డబ్బుకు అందరు ప్రాముఖ్యతని ఇస్తారు. ఎందుకంటే.. డబ్బు వలన సమాజంలో గౌరవం, జీవితంలో సుఖాలు లభిస్తాయని నమ్ముతారు కాబట్టి. అయితే.. చాలా మంది తమ జీవితంలోకి డబ్బు వచ్చిన తరువాత మార్పుని గమనిస్తూ ఉంటారు. పండితులతో, వేదాలను పాటించే వ్యక్తులతో మతాన్ని అనుసరించే వారితో సావాసం చేయాలనీ, చెడు అలవాట్లు ఉన్నవారిని దూరంగా ఉంచాలని.. ఎందుకంటే చెడు అలవాట్లు కలిగిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని చెప్పుకొచ్చారు.

అయితే.. చేతిలోకి డబ్బు వచ్చిన తరువాత మరింత అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. చాలా విషయాలలో జాగరూకతతో వ్యవహరించాలని చెబుతున్నారు. బలహీనులను అవమానించి.. వారి హక్కులను హరించేవారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని, ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎక్కువ కాలం నిలవదని, అత్యాశ కూడదని, అత్యాశ ఉన్న వారిని లక్ష్మి దేవి అనుగ్రహించదని చెప్పుకొచ్చారు. ఏ వ్యక్తీ సంపదని అవమానించకూడదని, చెడు సావాసాలను వదిలివేయాలని చెప్పుకొచ్చారు. సంపదను పొదుపు చేసుకుంటూ అవసరాలకు తగ్గట్లు ఖర్చు చేసుకునే వారి వద్ద లక్ష్మీదేవి చిరకాలం కొలువై ఉంటుందని చాణుక్యుడు తెలిపాడు.


End of Article

You may also like