నేపాల్ లో ఎవ్వరూ ఊహించని వింత.. దీని గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమి ఉందంటే?

నేపాల్ లో ఎవ్వరూ ఊహించని వింత.. దీని గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమి ఉందంటే?

by Anudeep

Ads

భారతీయులు ఎక్కువ గా జ్యోతిష్య శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణం గా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు. అయితే, మన పూర్వికులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు.

Video Advertisement

వాటిలో “బ్రహ్మం గారి కాల జ్ఞానం” ఎక్కువ ప్రాచుర్యం పొందింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానం తో భవిష్యత్ లో ఏమి జరగబోతోందో ముందే చెప్పారు.

veerabrahmam 2

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి,హేతువాది, సంఘ సంస్కర్త . బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్ లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి చెప్పారు .వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి . తాజాగా మరో వింత కూడా నిజమైంది. అదే బంగారు తాబేలు జన్మించడం. సాధారణంగా ఏదైనా వింత జరిగితే.. బ్రహ్మం గారు ముందే చెప్పారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతూ ఉండడం మామూలు విషయమే.

veerabrahmam 1

తాజాగా.. వైరల్ అవుతున్న ఈ పోస్ట్ గురించి తెలుసుకుందాం. తాజాగా.. నేపాల్ లో బంగారు తాబేలు పుట్టింది. అయితే.. బ్రహ్మం గారు ముందే చెప్పారు అంటూ ఈ విషయాన్నీ తెగ వైరల్ చేసేస్తున్నారు. మామూలుగానే నేపాల్ లో తాబేళ్లను దేవునిగా పూజిస్తూ ఉంటారు. బంగారు రంగులో మెరుస్తూ ఉన్న తాబేలు పుట్టేసరికి.. అందరు దీనికి పని కట్టుకుని పూజలు చేసేస్తున్నారు. అయితే.. బంగారు తాబేళ్లు ఉండవని.. జన్యు లోపాల కారణంగానే తాబేళ్లు రంగు మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా పూజలు చేసుకుంటున్నారు.

golden tortoise

అంతే కాదు.. ఆయనలు పలు ఇతర విషయాల గురించి కూడా వెల్లడించారు.వెంకటేశ్వర స్వామి వారి సంపదని ఆరుగురు దోచుకుంటారని, శ్రీశైల మల్లిఖార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, కృష్ణా నది మధ్యలో బయటపడ్డ బంగారు రధాన్ని చూసిన వారు కళ్ళు పోగొట్టుకుంటారని, మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయదుర్గం లో చిలుక వీర ధర్మాలను చెబుతుందని, బనగానపల్లి లో పాతరమీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లిఖార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. ఇప్పటికే ఆయన చెప్పినవి కొన్ని నిజమవ్వడంతో.. ఆయన కాలజ్ఞానానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది.


End of Article

You may also like