ఇంట్లోనే బైక్ ని వాష్ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలని తప్పకుండా పాటించండి..!

ఇంట్లోనే బైక్ ని వాష్ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలని తప్పకుండా పాటించండి..!

by Anudeep

Ads

మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ముందు బైక్ లేదా స్కూటర్ తీస్తాం.. రెగ్యులర్ ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించినా చాలా మంది బైక్స్ నే వాడతారు. కార్ కంటే చాలా మంది బైక్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత ట్రాఫిక్ లో అయినా.. బైక్ పై అయితే సులభంగా వెళ్ళిపోతూ ఉండవచ్చు.

Video Advertisement

అయితే.. బైక్ ని ఎంత జాగ్రత్తగా వాడినా రోడ్ మీద వెళ్ళినప్పుడో.. లేక పార్కింగ్ చేసినప్పుడో దానికి దుమ్ము అంటుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బైక్ ను క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది.

bike washing 1

బైక్ ని మైంటైన్ చేసేటప్పుడు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. అలాగే వాషింగ్ కూడా చేయించాలి. అయితే.. ప్రతి సారీ సర్వీసింగ్ కి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి కొందరు తమ బైక్ ను ఇంట్లోనే వాష్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. చాలా మంది బకెట్ల కొద్దీ వాటర్ ను పోసేస్తూ క్లీన్ చేస్తూ ఉంటారు. అసలు బైక్ ను ఇంట్లోనే క్లీన్ చేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

bike washing 2

#1. బైక్ ని కడిగిన ప్రతి సారి ఎగ్జాస్ట్ పైప్ లో ఉండే సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లకుండా చూడాలి. నీరు లోపలకి పోతే.. బైక్ ని స్టార్ట్ చేయడం కష్టం. ఎక్కువ సార్లు కిక్ ఇవ్వాల్సి వస్తుంది.

#2. అలాగే కీ-లాక్ లోకి కూడా వాటర్ వెళ్ళకూడదు. అక్కడకి వాటర్ పోతే.. బైక్ ని లాక్ చేయడం, అన్ లాక్ చేయడం కష్టం అవుతుంది. కొన్ని సార్లు అది పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక వేళ పొరపాటున కీ-లాక్ లోకి నీరు పోతే అది ఆరిపోయే వరకు ఇబ్బంది అవుతుంది. కీ-లాక్ కొంచం నూనె వేయడం ద్వారా తిరిగి లాక్ చేయడం- అన్ లాక్ చేయడం చేయవచ్చు.

bike washing 3

#3. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బైక్ ను వాష్ చేసేటప్పుడు నీరు ఫ్యూయల్ ట్యాంక్ లోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే.. ఫ్యూయల్ ట్యాంక్ లోకి వాటర్ వెళ్తే ఆ వాటర్ పెట్రోల్ తో కలిసి పెట్రోల్ సామర్ధ్యం తగ్గుతుంది. వాటర్ కలిసిన పెట్రోల్ ను ఇంజిన్ తీసుకోదు. దీనితో బైక్ స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయినా బైక్ సరిగా నడవదు.


End of Article

You may also like