ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ లలో అడుగున ఇచ్చే ఈ పిల్ ఏంటి..? ఎందుకు ఇస్తారో తెలుసా..?

ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ లలో అడుగున ఇచ్చే ఈ పిల్ ఏంటి..? ఎందుకు ఇస్తారో తెలుసా..?

by Anudeep

Ads

కొన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లలో లోపల ఒక పిల్ ఉంటుంది. దీని గురించి యువత మరియు తల్లి తండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. చాలా టెస్టింగ్ కిట్ లు కేవలం టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. మనకి ప్రెగ్నన్సీ వచ్చిందేమో అన్న అనుమానం వచ్చినప్పుడు ఈ టెస్టింగ్ కిట్ తో యూరిన్ తో టెస్ట్ చేసుకోవాలి.

Video Advertisement

కిట్ పైన రెండు ఎర్ర గీతలు వస్తే పాజిటివ్ వచ్చినట్లు అర్ధం. అలా కాకుండా ఒక్క గీత మాత్రమే కనిపిస్తే నెగటివ్ గా అర్ధం చేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే.. తెలియని విషయం ఏంటంటే ఈ కిట్ లోపల ఒక పిల్ ఉంటుంది.

pill 1

ఇది ఎందుకు ఇస్తారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇటీవల టిక్ టాక్ వీడియో యాప్ లో ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ ల లోపల ఒక పిల్ ఉంటుందని.. ఇది ప్లాన్ -B పిల్ అని.. ఒకరకమైన బర్త్ కంట్రోల్ పిల్ అని.. ప్రెగ్నన్సీ వద్దు అనుకుంటే తీసుకోవచ్చు అని ఈ వీడియో సారాంశం.

pill 2

ఈ విషయమై ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ మేకర్స్ స్పందించారు. అసలు ఇది బర్త్ కంట్రోల్ పిల్ కాదు. కిట్ ను ఫ్రెష్ గా ఉంచడానికి మరియు లోపలి తేమని గ్రహించడానికి మాత్రమే టెస్టింగ్ కిట్ లోపల ఒక పిల్ ను ఉంచుతారు. దీనిని పొరపాటున కూడా తినకూడదు. ఇది ఒక చిన్న ఒక చిన్న డెసికాంట్ టాబ్లెట్ మాత్రమే. ఎవరైనా పొరపాటున దీనిని తీసుకుంటే కచ్చితంగా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది గర్భ నిరోధక మాత్ర కానే కాదని మేకర్స్ వక్కాణించారు.


End of Article

You may also like