Ads
పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు.అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మనకు అనేక రకాల లాభాలే ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే.
Video Advertisement
అయితే.. మనకి పెరుగు కావాలంటే ఏమి చేస్తాం..? పాలని కాచి చల్లార్చి.. గోరు వెచ్చగా ఉన్న సమయంలో అందులో కొంచం పెరుగుని వేస్తాము. మరో 2 -3 గంటలకు పెరుగు తోడుకుంటుంది.
అసలు ఇంట్లో పెరిగే లేనప్పుడు పెరుగు కావాలంటే ఇలా..? అది తెలియాలంటే ఈ ఆర్టికల్ ని చదివేయండి. పెరుగు లేకపోయినా పాలని రెండు రకాలుగా తోడు పెట్టొచ్చు. మొదటిది ఏంటంటే.. పాలు గోరు వెచ్చ గా ఉన్నప్పుడే అందులో రెండు పచ్చి మిరపకాయలు వేయండి. రెండు నుంచి నాలుగు గంటల పాటు ఈ పాలని వెచ్చని ప్రదేశంలో కదల్చకుండా ఉంచితే పెరుగు తోడుకుంటుంది. తరువాత తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిపడి తినడానికి కమ్మగా ఉంటుంది.
రెండవ పద్ధతిలో నిమ్మకాయ అవసరం అవుతుంది. అయితే.. ఈ పధ్ధతి లో పెరుగు తోడు కోవడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడే అందుకే అర స్పూన్ నిమ్మరసాన్ని వేయాలి. పది నుంచి పన్నెండు గంటల పాటు పాలని కదల్చకుండా ఉంచాలి. ఆ తరువాత తోడుకున్నాక గట్టి పడే వరకు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. అయితే.. ఈ రెండు పద్ధతులలోను క్రీం మిల్క్ ని ఉపయోగించాలి. పాలను గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అలాగే.. తోడుకు పెట్టిన తరువాత ఆ పాల గిన్నెని కదల్చకుండా ఉండాలి.
End of Article