మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా ఎక్కడ వాడారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి..!

మీ ఆధార్ కార్డు మీకు తెలియకుండా ఎక్కడ వాడారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి..!

by Anudeep

Ads

ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఐడెంటిటీ కార్డు లాంటిది. భారతీయులకు ఇది చాలా ముఖ్యులమైన డాక్యుమెంట్. ఇది లేకుండా చాలా పనులు జరగవు. బ్యాంకింగ్ దగ్గరనుంచి ప్రభుత్వ, ఇతర ప్రైవేట్ పనుల వరకు అన్నిటికి ఆధార్ అవసరమే. ప్రతి చిన్న పనికి ఆధార్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Video Advertisement

అందుకే ఆధార్ కార్డులో తప్పులు లేకుండ ఉంచుకోవాలి. ఒకవేళ తప్పు ఉంటె దానిని యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రతి చోట రుజువుగా ఆధార్ గుర్తింపుని అడుగుతున్నారు.

adhar update

ప్రభుత్వ ఏజెన్సీలు అందించే సేవలను వినియోగించుకోవడం కోసం ప్రతి పౌరుడు ఆధార్ పై ఆధారపడుతున్నాడు. పౌరుల వివరాలన్నీ జనాభా వివరాల భారత విశిష్ట గుర్తింపు సంస్థ ( UIDAI) ఆధార్ కార్డులో నమోదు చేసి ప్రజలకి అందించింది. ప్రభుత్వ ఏజన్సీలు అందించే సాయం పొందాలంటే ఆధార్ ని తప్పని సరి చేసారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆన్ లైన్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

చాలా మంది నకిలీ ఆధార్ కార్డులను సృష్టించుకుని వాడుతున్నారు. మనం ఎక్కడైనా ఆధార్ కార్డుని నమోదు చేసినా.. దానికి కూడా నకిలీ చేసి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఇలాంటి కేసులను చాలానే పట్టుకున్నారు. ఈ క్రమంలో మీ ఆధార్ కార్డు కూడా మీకు తెలియకుండా ఎక్కడైనా ఉపయోగించారా? అన్న సంగతిని మీరు ముందే తెలుసుకోవచ్చు.

అధికారిక https://uidai.gov.in/ పోర్టల్ లోకి వెళ్లడం ద్వారా మీ ఆధార్ కార్డు గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వినియోగించబడిందో తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ ఓపెన్ చేసాక మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి సర్వీసెస్ ను ఎంపిక చేయాలి. వాటిల్లో ఎనిమిదవ వరుసలో ఆధార్ అథేంటీఫికేషన్ హిస్టరీ లోకి వెళ్ళాలి. ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో నెల, తేదీ, సంవత్సరం ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత మీ ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ ను ఏ సమయంలో ఎక్కడ ఉపయోగించారో వివరాలు వచ్చేస్తాయి. మీరు కూడా చెక్ చేసుకుని ముందుగానే జాగ్రత్త పడండి.


End of Article

You may also like