Ads
నిద్ర సుఖమెరుగదు అంటుంటారు కానీ.. కొంచమైనా సుఖం గా నిద్రపట్టకపోతే తెల్లారి పనులన్నీ అన్యమస్కం గా చేస్తుంటాము. ఆరోగ్యకరం గా పనులు చక్కదిద్దుకోవాలంటే.. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోవాలి.చాలా మంది కలత నిద్రపోతూ ఉంటారు. పడుకున్నట్లే ఉంటారు కానీ.. గాఢం గా నిద్రపోలేరు.
Video Advertisement
మరికొంత మంది ఆలస్యంగా పడుకుని తొందరగా లేచేస్తూ ఉంటారు. పని ఒత్తిడి కావచ్చు, సమయాభావం కావచ్చు సరిగ్గా నిద్ర పోకుండానే మరుసటి రోజుని ప్రారంభించేస్తూ ఉంటారు.
సగటు మనిషి ప్రతి రోజు కనీసం ఆరు గంటల పాటు నిద్రపోవాలి. 8 గంటల వరకు నిద్రపోతే అది పూర్తిగా ఆరోగ్యంగా నిద్రపోయినట్లు అవుతుంది. కనీసం ఆరు గంటలైనా పడుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోజులో కనీసం ఆరు గంటలైనా పడుకోవడం కుదరకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర లేకుంటే మానసిక స్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభం అవుతుంది. దాని వలన డిప్రెషన్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
డిప్రెషన్ వస్తే నిద్ర రాదు. నిద్ర రాకపోతే డిప్రెషన్ వస్తూ ఉంటుంది. అందుకే రోజుకు 6 గంటలైనా నిద్రపోవాలి. అంతకంటే తక్కువ నిద్రపోయేవారికి జ్ఞాపకశక్తి దెబ్బ తింటూ ఉంటుంది. ఇలా నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. యోగ, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా కూడా మానసిక శాంతిని పొంది ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
End of Article