Ads
మనం రోజు వారి దినచర్యలో గమనించే చాలా విషయాలను పట్టించుకోకుండా ఉంటాం. తీరా దాని ఉపయోగం ఏంటో తెలిసాక ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటిదే ఇది కూడా. మీరెప్పుడైనా గమనించారా..? చాలా వరకు వచ్చే రెడీ మేడ్ షర్ట్ ల వెనకాల ఇలాంటి లూప్ ఒకటి ఉంటుంది.
Video Advertisement
ఇది ఎందుకు ఇస్తారో..? దీని వలన ఉపయోగం ఏంటో తెలుసా..? తెలియక పోతే ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి. సాధారణంగా మనం ఆఫీస్ లేదా.. కాలేజీ కి వెళ్లి వచ్చిన తరువాత ఆ షర్ట్ ని హాంగర్ కి తగిలించి జాగ్రత్త పెడతాం.
అలా ఉంచడం వలన షర్ట్ కి ఉన్న ఇస్త్రీ మడతలు పోకుండా ఉంటాయి. మరో సారి ఆ షర్ట్ ని ధరించాలని అనుకుంటే ఆ షర్ట్ నీట్ గా ఉంటుంది. అయితే ఈ లూప్ అనేది షర్ట్ వెనకాల ప్లీట్.. యోక్కి కలిసే చోట ఇస్తారు. ఇది చూడడానికి డిజైన్ లాగా అనిపిస్తుంది. కానీ డిజైన్ అనుకుంటే పొరపాటే. ఇది డిజైన్ కాదు. వార్డ్ రోబ్ లు, హ్యాంగర్లు లేని రోజుల్లో ఈ లూప్ వల్ల చాలా ఉపయోగం ఉండేది.
ఆ రోజుల్లో చొక్కాలకు ముడతలు పడకుండా ఈ లూప్ తో మేకులకు తగిలించి వారు. అప్పుడు ఆ చొక్కాలకు నీట్ గా ఉండేవి. 1960 లలో US-తయారైన ఆక్స్ఫర్డ్ బటన్-డౌన్ చొక్కాలతో ఈ ట్రెండ్ మొదలైంది. మొదట దీనిని లాకర్ లూప్ అని పేరు పెట్టారు. ఆ తరువాత కాలంలో ఫెయిరీ లూప్, ఫాగ్ ట్యాగ్ లేదా ఫ్రూట్ లూప్ అని కూడా పిలవడం మొదలు పెట్టారు. చాలా బ్రాండ్స్ ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నాయి. హ్యాంగర్లకు తగిలించుకునే ఫెసిలిటీ ఉన్నప్పటికీ ఈ లూప్ ఒక డిజైన్ లా బాగుండడంతో ఈ ట్రెండ్ నేటికీ కొనసాగుతోంది. హ్యాంగర్స్ లేని టైములో ఈ లూప్ సాయంతో ఎంచక్కా మీ చొక్కాని మడతలు లేకుండా తగిలించేసుకోవచ్చు.
End of Article