కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఖాళీ అయ్యాక వాటర్ నింపుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు ఈ పని చెయ్యరు..!

కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఖాళీ అయ్యాక వాటర్ నింపుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు ఈ పని చెయ్యరు..!

by Anudeep

Ads

చిన్నా.. పెద్దా.. వయసు తేడా లేకుండా.. ఆడ, మగా జెండర్ తేడా లేకుండా అందరు కూల్ డ్రింక్స్ ని ఇష్టపడతారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు కూల్ డ్రింక్స్ తప్పనిసరి. కేక్ కట్ చేసినా.. స్నాక్స్ ఎన్ని ఉన్నా ఓ కూల్ డ్రింక్ బాటిల్ కి మాత్రం తప్పకుండా ప్లేస్ ఇస్తాం.

Video Advertisement

ఇక లంచ్ పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ఏ థమ్స్ అప్ బాటిలో లేకుండా లంచ్ ఫినిష్ అవ్వదు. మనం ఇన్ని సార్లు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ని తెచ్చుకుంటాం కదా. ఆ కూల్ డ్రింక్స్ అన్ని తాగేసాక మిగిలిపోయిన బాటిల్స్ ని ఏమి చేస్తాం?

water

కొన్ని బాటిల్స్ ని అయితే పారేస్తాం. కొన్ని బాటిల్స్ లో మాత్రం వాటర్ పట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం. మధ్య తరగతి కుటుంబాలలో చాలా మంది చేసే పనే ఇది. కొందరైతే మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్న తరువాత వాటిని కూడా అట్టేపెట్టుకుని ఇలా రెగ్యులర్ వాటర్ బాటిల్స్ లాగ వాడుకుంటూ ఉంటారు. అయితే.. దీని వలన కలిగే నష్టం ఏంటో చాలా మందికి తెలియదు.

water

ఇలా ఆల్రెడీ కూల్ డ్రింక్స్ కోసం మరియు మినరల్ వాటర్ కోసం ఉపయోగించిన బాటిల్స్ నే మళ్ళీ ఉపయోగించడం వలన అది మన శరీర రోగ నిరోధక వ్యవస్థపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ బాటిల్స్ తయారీలో ఉపయోగించిన ప్లాస్టిక్ లో థాలెట్స్ అనే రసాయనాలు ఉంటాయి. అటువంటి బాటిల్స్ లో వాటర్ పట్టడం వలన శరీరం లో బీపీఏ ఏర్పడుతుంది.

water 1

బీపీఏ అంటే బై ఫోలేట్ ఏ. దీనివల్ల స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. ఈ వాటర్ బాటిల్స్ ను పట్టుకుని ఎండలో అస్సలు తిరగకూడదు. ఎందుకంటే సూర్య రశ్మి వలన బాటిల్స్ వేడెక్కి విషాన్ని విడుదల చేస్తాయి. ఆ వాటర్ తాగడం వలన కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


End of Article

You may also like