Ads
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎండ వేడికి శరీరం డ్రై అయిపోతూ ఉంటుంది. శరీరంలో వాటర్ శాతం తగ్గిపోయి డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటాం. అయితే.. చాలా మంది కూల్ డ్రింక్స్ పైనా, ఇతర శీతల పానీయాల పైనా డిపెండ్ అవుతూ ఉంటారు. అయితే చాలా మంది మజ్జిగ తాగడానికే ఇష్టపడుతూ ఉంటారు.
Video Advertisement
ఇది వేసవి రోజులలో మనల్ని చల్లగా ఉంచుతుంది, జీర్ణక్రియలో సహాయపడుతుంది, ఇది మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, బలమైన ఎముకలకు మద్దతు ఇస్తుంది.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మజ్జిగ తాగడం వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. మజ్జిగ తాగడం వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒక కప్పు (245 ml) మజ్జిగలో 98 కేలరీలు, 8 గ్రాముల ప్రొటీన్లు, 3 గ్రాముల ఫైబర్, 22% కాల్షియం, 16% సోడియం మరియు 22% విటమిన్ B12 లభిస్తాయి. కానీ మజ్జిగలో కొన్ని వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యేవి కూడా ఉంటాయి. ఉప్పు వేసుకుని మజ్జిగ తాగడం అందరికి అలవాటే. కానీ ఉప్పు కలిసిన మజ్జిగ కొందరికి అలెర్జీ కలుగచేసే అవకాశం ఉంటుంది. మజ్జిగ గురించి మీకు తెలియని మరికొన్ని దుష్ప్రభావాలను ఇప్పుడు తెలుసుకోండి.
జలుబు, జ్వరం లేదా అలర్జీ ఉన్న సమయంలో మజ్జిగ రాత్రి సమయాల్లో అస్సలు తాగకూడదు. వెన్న నుండి క్రీమ్ (మలై) తీసి మజ్జిగ తయారు చేస్తారు మరియు మీగడ పెరగడానికి రోజుల తరబడి ఉంచాలి, కాబట్టి చిన్న పిల్లలకు మజ్జిగ ఇవ్వకూడదు. వెన్నలో హానికరమైన బ్యాక్టీరియా వచ్చి గొంతు ఇన్ఫెక్షన్ మరియు జలుబు వస్తుంది.
మూత్రపిండ వ్యాధి ఉన్న వ్యక్తులు మజ్జిగలో సోడియం ఉన్నందున దానిని నివారించాలి.
End of Article