Ads
వేసవి కాలంలో ఎండా వేడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మన శరీరంలో కూడా వేడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీని వలన శరీరంపై సెగ్గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెగ గడ్డలు వలన వచ్చే సమస్య చిన్నదే.. కానీ దాని వలన వచ్చే బాధ మాత్రం భరించలేనంతగా ఉంటుంది.
Video Advertisement
అయితే వీటిని తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే వీటి వలన సెగ్గడ్డలు తగ్గడానికి సమయం తీసుకుంటూ ఉంటాయి.
వీటన్నిటి కంటే మీ వంటింట్లో ఉండే వాటితోనే సులభంగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. సిగ్గుదలను తగ్గించుకోవడం కోసం ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. సెగ గడ్డలను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. వెల్లుల్లి లోని యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు సెగ్గడ్డలను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి తొక్క తీసిన వెల్లుల్లి లో అర స్పూన్ వాము కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ని సెగ్గడ్డలు వచ్చిన చోట రాయాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. తద్వారా త్వరగా సెగ్గడ్డలు తగ్గుతాయి.
ఇక, బియ్యప్పిండి కూడా సెగ్గడ్డలను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. రెండు స్పూన్ల బియ్యం పిండిని నీటిలో వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే సెగ్గడ్డలపై రాయాలి. చల్లారిన తరువాత కడిగేయాలి. ఈ రెండు చిట్కాలు సెగ్గడ్డలను తగ్గించడం లో బాగా ఉపయోగపడతాయి.
End of Article