Ads
ఇటీవల చాలా స్మార్ట్ ఫోన్లు ఫింగర్ ప్రింట్ అన్ లాక్ ఫీచర్ తో వస్తున్నాయి. చాలా మంది లాక్ పెట్టుకోవడం కంటే ఫింగర్ ప్రింట్ తోనే ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే.. ఓ వ్యక్తి చనిపోయిన తరువాత మాత్రం అతని ఫింగర్ ప్రింట్ తో మనం అతని ఫోన్ ను అన్ లాక్ చేయలేము. ఇలా ఎందుకు చేయలేము? అన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.
Video Advertisement
ఎందుకంటే, చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ అన్ లాక్ అనేది విద్యుత్ వాహకత ద్వారా పని చేస్తూ ఉంటుంది. దీని గురించి మరింత వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మనందరి శరీరాల్లోనూ కొద్దిపాటి విద్యుత్ ప్రవహిస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌పై మన వేలిముద్రలను ఉంచినప్పుడు, మన వేలిముద్ర యొక్క గుర్తులు మొబైల్ ఫోన్ పై ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్లను తాకుతాయి. మన ఫింగర్ ప్రింట్ లో ఎత్తుగా ఉండే భాగం సెన్సార్ ను తాకుతుంది. మరియు కొంచం గీతల మధ్య లోతుగా ఉండే ప్రాంతం సెన్సార్ ను తాకదు. ఈ నమూనాని బట్టి సెన్సార్ మొబైల్ ను అన్ లాక్ చేస్తూ ఉంటుంది.
వేలి నుండి వచ్చే విద్యుత్ ద్వారానే ఈ సెన్సార్ ఈ ఫింగర్ ప్రింట్ ను గుర్తించగలుగుతుంది. కానీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. దానివలన స్కానర్ పై ఫింగర్ పెట్టినప్పుడు ఎటువంటి చర్య జరగదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత శరీరం ఈ విద్యుత్ వాహకతను ఎంతకాలానికి కోల్పోతోంది అన్న సంగతి సైంటిస్టులకు కూడా అంతుబట్టడం లేదు. దాన్ని గుర్తించడానికి, మీకు “చాలా మృతదేహాలు కావాలి, మరియు మీరు ప్రతి గంట లేదా అంతకంటే ఎక్కువ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వారి వేలిముద్రలను తీసుకోవాల్సి ఉంటుంది ఇది కష్టమైన ప్రయోగమని సైంటిస్ట్ లు చెబుతున్నారు.
మరోవైపు సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది: ఉదాహరణకు, iPhone Xని తీసుకుంటే, ఇది వేలిముద్రలను చదవడానికి ప్రత్యేక బటన్‌ను కలిగి ఉండదు, కానీ అది మీ ముఖాన్ని గుర్తించినప్పుడు అన్‌లాక్ చేస్తుంది. భవిష్యత్ లో వచ్చే ఫోన్‌లు వాటి స్క్రీన్‌ల క్రింద ఆప్టికల్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి. అయితే ఇవి మరణించిన వారి ఫింగర్ ప్రింట్స్ ద్వారా అన్ లాక్ అవుతాయో లేదో అన్న విషయమై స్పష్టత లేదు.
End of Article