Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు.
Video Advertisement
వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. అలాగే తోటి వారితో స్నేహ బంధాలను ఎలా కొనసాగించాలి.. అవతలి వారిని మన వశం చేసుకుని ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను కూడా చాణుక్యుడు వివరించాడు.
అవతలి వారు మనం చెప్పినట్లు చేయాలంటే ముందు మనం వారి మనస్తత్వాన్ని అంచనా వేయాలి. వారు అత్యాశ పరులైతే, వారికి కావాల్సింది వారికి ఇచ్చేయాలి. కొందరు ధనం పైనా, మరికొందరు వస్తువుల పైనా అత్యాశను కలిగి ఉంటారు. వారికి మీతో అవసరం ఉంటె మీతో తియ్యగా మాట్లాడి వారి పనులు పూర్తి చేసుకుంటారు. వారికి ధనం ఆశ చూపి మీ వశంలోకి తెచ్చేసుకోవచ్చు. కొందరు గర్వాన్ని కలిగి ఉంటారు. వీరిని పొగడ్తలతో ముంచెత్తి.. వీరి గర్వాన్ని శాటిస్ఫై చేయడం ద్వారా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఇక ఏ విషయం పైనా సరైన అవగానే లేని మూర్ఖులు ఉంటారు. వీరి ఏమీ ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు. దాని వలన ఇబ్బందుల్లో పడుతుంటారు. అయితే సక్సెస్ లేక ఇబందుల్లో పడుతూ ఉంటారు. వీరికి సరైన మాట సాయం చేసి దారిలో పెడితే మీ వశంలోకి వచ్చేసి మీరు చెప్పినట్లు వింటారు. వీరికి మంచి సలహాలు ఇవ్వడం ద్వారానే వశం చేసుకోవచ్చు.
ఇక కొందరు ప్రతిభావంతులు వుంటారు. సాధారణంగా వీరే ఇతరులను వశం చేసుకుంటూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ సత్యాన్ని, నిజాయితీ ని కోరుకుంటారు. అందుకే వీరిని వశం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ నిజాలని మాట్లాడుతూ ఉండాలి. మనకి గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎల్లప్పుడూ విజయం సాధిచే వారి వెంట నడుస్తూ ఉండాలి. ఎవరినైనా అందరు పొగుడుతున్న సమయంలో మనం కూడా పొగుడుతూ ఉండాలి. ఎవరి జీవితం ఎప్పుడెలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి.
End of Article