Ads
శకునం అంటే సమయం అనే అర్ధం వస్తుంటుంది. మంచి సూచన వచ్చే సమయాలని శుభ శకునాలని.. అదే చెడు సూచనలు ఎదురవుతూ ఉంటె వాటిని చెడు శకునాలు అని అంటుంటారు. అద్దం పగలడం, కత్తి నేలపై పడడం, పాలు నేలపై పడిపోవడం వంటి వాటిని చెడు శకునాలుగా భావిస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే, ఏదైనా పని ప్రారంభించే ముందు పొరపాటున అద్దం మిగిలిపోతే ఆ పనిని మానుకోవాలని, లేదా కనీసం వాయిదా వేయాలని పెద్దలు చెబుతుంటారు. అయితే.. అద్దం పగిలితే దానిని చెడు శకునం అని ఎందుకు నమ్ముతారు?
దీని వెనుక చాలా నమ్మకాలు ఉన్నాయి. అసలు అద్దం పగిలిపోవడం వలన నిజంగా దురదృష్టం ఏర్పడుతుందా? అన్న సందేహం కలిగితే కొందరు అవుననే సమాధానం చెబుతారు. ఈ నమ్మకం యొక్క ఖచ్చితమైన మూలాలు ఖచ్చితమైనవి కానప్పటికీ, శతాబ్దాల నాటి సిద్ధాంతం అద్దం అనేది ఒకరి రూపాన్ని మరియు ఒకరి ఆత్మ యొక్క ప్రొజెక్షన్ అని బలంగా విశ్వసిస్తుంటారు. అద్దాన్ని పగలగొట్టడం అనేది ఆత్మని ముక్కలు చేయడంగా భావించబడుతోంది.
ఆత్మ ఎప్పుడైనా శరీరం నుంచి విడుదల అయినప్పుడు నెగటివ్ ఎనర్జీని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఆత్మలు, దెయ్యాలు అనేవి మూఢ నమ్మకాలు అయినప్పటికీ వాటిని నెగటివ్ ఎనర్జీగానే పరిగణిస్తుంటారు. అందుకే ఆత్మకు ప్రతిరూపం అయిన అద్దాలు పగిలినప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అని, అందుకే మొదలుపెట్టిన పనిని మానుకోవాలని, తప్పనిసరి పని అయితే కొంత సమయం వాయిదా వేయాలని చెబుతుంటారు. తద్వారా చెడు శకునం తాలూకు నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యి పని సక్రమంగా పూర్తవుతుందని నమ్ముతారు.
పగిలిన అద్దాలు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయనే ఆలోచన పురాతన గ్రీకుల నుండి వచ్చింది, వారు ఆత్మలు ప్రతిబింబించే నీటి కొలనులలో నివసిస్తున్నారని నమ్ముతారు. అలాగే అద్దాలు కూడా ఆత్మలని ప్రతిబింబిస్తాయి కాబట్టే ఈ నమ్మకం ఏర్పడిందని చెప్పవచ్చు.
End of Article