Ads
మీరు ఎప్పుడైనా గమనించారా..?.. చాలా మంది అమ్మాయిలు తమ కాలికి నల్ల దారం కట్టుకుని ఉంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది అమ్మాయిలే కట్టుకుంటున్నారు. కొందరు అబ్బాయిలు కూడా కట్టుకుంటున్నారు. అయితే, ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ అవుతున్నా, దీని వెనక మన పెద్దల దూరాలోచన కూడా ఉంది. అదేంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Video Advertisement
చాలా మంది వీటిని ఎందుకు కట్టుకుంటున్నారో తెలీకుండానే కట్టుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు కట్టుకుంటున్నారు. ముఖ్యంగా పసి పిల్లలకు పుట్టిన పదకొండవ రోజే రెండు కాళ్లకు నల్లదారాన్ని కడతారు. దీని వెనక శాస్త్రీయ కారణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
సాధారణంగా పసి పిల్లలు అయినా, పెద్ద వాళ్ళు వారి శరీరం చుట్టూ ఒక ఆరా ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు వారి వ్యక్తిత్వం, ఆలోచనల బట్టి ఈ ఆరా పని తీరు ఉంటుంది. అయితే.. మనలని చూసి ఎవరైనా అదే పనిగా మెచ్చుకున్నప్పుడు, దిష్టి పెట్టినప్పుడు వారి కంటి చూపు మన శరీరం చుట్టూ ఉండే ఆరాపై పడుతుంది. ఫలితంగా మనలని రక్షణ కవచంలా కాపాడే ఆరాకి చిల్లులు పడి ఆ ప్రభావం మన ఆరోగ్యం పై కూడా పడుతుంది.
ఫలితంగా నిద్రలేమి, అలసట, ఏ పని చేయాలనీ అనిపించకపోవడం, నిరాశ వంటివి చేరుతూ ఉంటాయి. ఈ లక్షణాలు పసి పిల్లలలో కూడా త్వరగా కనిపించేస్తూ ఉంటాయి. వారు నిలకడగా కూర్చోలేరు, పడుకోలేరు, అలసటతో ఏడుస్తూ ఉంటారు. వారికి దిష్టి తగలడం వలనే ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే పసి పిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం నల్ల బొట్టు పెట్టడం, రెండు కాళ్ళకి నల్ల దారం కట్టడం, ఇంకా నల్లని మొలతాడుని కట్టడం చేస్తుంటారు. ఎందుకంటే పసిపిల్లల్ని చూసిన ప్రతి వాళ్లు ముద్దు చేస్తూ ఉంటారు. అందుకే వారికి దిష్టి తగలకుండా ఉండడం కోసం ఇలా నల్లదారం కడుతుంటారు.
End of Article