Ads
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని మనిషి అంటూ ఎవరూ కనిపించడం లేదు. పెరిగిన అవసరాలే కావచ్చు.. సాంకేతికత కావచ్చు మనిషికి స్మార్ట్ ఫోన్ అనే పరికరాన్ని నిత్యావసర వస్తువుగా మార్చేశాయి. స్మార్ట్ ఫోన్ లేకుండా పనులు జరగవు అనే పరిస్థితికి తీసుకొచ్చాయి. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడెక్కడ భద్రపరుచుకుంటున్నాం అన్న విషయమై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
Video Advertisement
ఆడవారైతే తమ స్మార్ట్ ఫోన్లను హ్యాండ్ బాగ్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ,మగవారు మాత్రం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను జేబులోనే పెట్టుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడడం వల్లే కాదు ఎక్కువ సేపు జేబుల్లో ఉంచుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయట.
అతిగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం వలన కళ్ళు దెబ్బతింటాయి. నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఈ స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొంతమంది పడుకునే ముందు ఫోన్ ను దూరంగా పెట్టకుండా దిండుకింద పెట్టుకుని పడుకుంటారు. దీనివలన కూడా ఆ రేడియేషన్ ప్రభావము మన శరీరంపై పడే అవకాశం ఉంటుంది. మొబైల్స్ నుంచి విడుదల అయ్యే రేడియో తరంగాలు మెదడుని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇంకా మరి కొంతమంది స్మార్ట్ ఫోన్ లో ముందు జేబులో కానీ, వెనుక ప్యాంటు లో కానీ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా బ్యాక్ ప్యాకెట్ లో ఫోన్ పెట్టుకునే వారికి కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్యాక్ ప్యాక్ లో పెట్టుకోవడం వలన చోరీకి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ముందు జేబులో పెట్టుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వలన గుండె బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా చొక్కా జేబులో ఫోన్ పెట్టుకుని తిరిగేవారు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
End of Article