మరో రెండు రోజుల్లో చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఇంతకీ ఎవరంటే?

మరో రెండు రోజుల్లో చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఇంతకీ ఎవరంటే?

by Anudeep

Ads

ప్రతి అమావాస్య పౌర్ణమిలకు సూర్య, చంద్ర గ్రహణాలు సామాన్యంగా వస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని గ్రహణాలు మన దేశంలో కనిపించవు. ఎవరైనా.. ఎక్కడ గ్రహణం కనిపిస్తుందో ఆ గ్రహణ కాలాన్ని మాత్రమే పాటిస్తూ ఉంటారు. ఈ లెక్కన ఈ నెల 16 వ తేదీన తొలి చంద్ర గ్రహణం రాబోతోంది.

Video Advertisement

కానీ ఈ చంద్ర గ్రహణం భారత దేశంలో కనిపించే అవకాశం లేదు. అయితే ఈ గ్రహణ సమయంలో జరిగే మార్పుల వలన జాతకాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. ఓ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది.

mesha rasi

ఈ గ్రహ మార్పిడుల కారణంగా కొన్ని రాశులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరికొన్ని రాశులకు మాత్రం శుభం చేకూరే అవకాశం ఉంది. ఈ నెల అనగా.. మే లో 16 వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం ఏర్పడే సమయానికి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. అదే సమయంలో శని, కుజ గ్రహాలు కుంభ రాశిలో ఉంటాయి. ఇక, ఈ గ్రహణం వలన ఏ ఏ రాశుల వారికి అనుకూలించబోతోంది అనేది తెలుసుకుందాం.

mesha rasi 2

మేష : ఈ రాశి వారికి చంద్ర గ్రహణం తరువాత కాలం అనుకూలిస్తుంది. ఎప్పటినుంచో వివాదంలో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి వీరికి ఇది అనువైన సమయం.

సింహ రాశి: ఈ రాశి వారికి కూడా ఇది ఎంతో అనువైన కాలం. ప్రభుత్వ ఉద్యోగులను ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది.

ధనుస్సు: వీరికి కూడా ఇది శుభ సమయం. ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ రాశి వారికి ఇది అనువైన కాలం.


End of Article

You may also like