ఫస్ట్ నైట్ రోజు బెడ్ పై గులాబీలు ఎందుకు చల్లుతారు..? దీని వెనుక అసలు కారణం ఏంటంటే?

ఫస్ట్ నైట్ రోజు బెడ్ పై గులాబీలు ఎందుకు చల్లుతారు..? దీని వెనుక అసలు కారణం ఏంటంటే?

by Anudeep

Ads

పెళ్లి జరిగిన తరువాత వధూవరులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచడం కోసం శోభనం అనే కార్యక్రమాన్ని జరుపుతారు. ఇందుకు కూడా మంచి ముహుర్తాన్ని ఎంపిక చేసుకుని.. శుభ సమయంలో వధూవరులను ఒక గదిలోకి పంపిస్తారు. అయితే.. ఆ సమయంలో గదిని కూడా అందంగా అలంకరిస్తారు. అది వారి ఇద్దరికీ కలిసి మొదటి రాత్రి కాబట్టే ఆ సమయాన్ని మెమరబుల్ గా మార్చడం కోసం గదిని అందంగా అలంకరిస్తారు.

Video Advertisement

మనం సినిమాల్లో గమనించినా కూడా.. బెడ్ పైన ఎర్రని గులాబీలతో అందంగా అలంకరిస్తారు. ఇదంతా ఆర్భాటం కోసం అనుకుంటే పొరపాటే. దీని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

wedding bed 1

గులాబీ రంగుని ప్రేమకి చిహ్నంగా భావిస్తారు. అందుకే గులాబీలను కూడా ప్రేమకు సంకేతంగా అందిస్తూ ఉంటారు. గులాబీ రంగు కానీ, గులాబీ పూల సువాసన కానీ శారీరక కోరికలను కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెంచడంలో ఇవి ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అందుకే వధూవరుల మధ్య కూడా అలాంటి అనుబంధం పెరగాలి అన్న ఉద్దేశ్యంతోనే వారిద్దరిని కలిపే తొలి రాత్రి రోజు గదిలో ఇలా గులాబీలతో అలంకరిస్తూ ఉంటారు.

wedding bed 2

అంతేకాక గులాబీలతో అలంకరించడం వలన గదికి ఎక్కడ లేని అందం వస్తుంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే మనసంతా తేలిక పడి పులకిస్తుంది. ఇటువంటి అనుభూతిని వధూవరులకు అందించడం కోసమే వీటితో అలంకరిస్తుంటారు. గులాబీల స్పర్శ కొత్తగా పెళ్లి అయిన జంట జీవితాన్ని ప్రేమతో నింపుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే తొలి రోజు వధూవరులు నిద్రించే గదిని గులాబీలతో అలంకరిస్తారు. వీటి వెనుక ఇంత అర్ధాలు ఉండబట్టే.. పూర్వీకుల కాలం నుంచే శోభనం అనే కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా నిర్వర్తించేవారు. కొత్తగా పెళ్లి అయిన వధూవరులను ఆశీర్వదించి గదిలోకి పంపించేవారు. వారి బంధం ప్రేమకు చిహ్నంగా, పవిత్రంగా ఉండాలని దీవించేవారు.


End of Article

You may also like