ఈ 4 రంగుల ఇండియన్ “పాస్ పోర్ట్” ల మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.?

ఈ 4 రంగుల ఇండియన్ “పాస్ పోర్ట్” ల మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.?

by Anudeep

Ads

పాస్ పోర్ట్ లో రంగుల గురించి తెలుసుకోవడానికి ముందు, అసలు పాస్పోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాస్ పోర్ట్ అనేది ఒక దేశ ప్రభుత్వం తన దేశ పౌరులకు జారీచేసే ప్రయాణ పత్రం. ఇది అంతర్జాతీయ ప్రయాణ ప్రయోజనం కోసం ఇచ్చే అనుమతి. పాస్ పోర్ట్లు సాధారణంగా ప్రయాణం కోసం అప్లై చేసిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జారీ చేసిన తేదీ, గడువు తేదీ, ఆ వ్యక్తి యొక్క ఫోటో, సంతకం మరియు పాస్ పోర్ట్ నెంబర్ కలిగి ఉన్న చిన్న పుస్తకం.

Video Advertisement

పాస్ పోర్ట్ అనేది ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి జారీ చేయబడుతుంది. పాస్ పోర్ట్ లో మొత్తం నాలుగు రంగుల విభజించబడ్డాయి. అలా నాలుగు రంగులు గా ఎందుకు విభజించబడ్డాయో అనే విషయం మనలో చాలామందికి తెలియదు. అసలు ఆ రంగులు వెనుక కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

#1 నేవీ బ్లూ :

నేవీ బ్లూ పాస్ పోర్ట్ అనేది  రెగ్యులర్ ఇండియన్ పాస్ పోర్ట్. విహారాలకు వెళ్లి వాళ్ళ కోసం, చదువు నిమిత్తం, వ్యాపార నిమిత్తం వేరే వాళ్ల కోసం జారీచేస్తారు.

#2 తెలుపు :

తెలుపు రంగు పాస్ పోర్ట్ అఫీషియల్ ఇండియన్ పాస్ పోర్ట్. ఈ తెలుపు రంగు పాస్ పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీషియల్ బిజినెస్ రిప్రెసెంటేటివ్స్  కోసం జారీ చేస్తారు.

#3 ఎరుపు :

రెడ్ డిప్లమాటిక్ ఇండియన్ పాస్ పోర్ట్. ఈ రంగు పాస్ పోర్ట్ ను డిప్లొమాట్స్ మరియు హై ర్యాంకింగ్ అఫీషియల్ కోసం, అంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాళ్లకోసం జారీ చేయబడుతుంది.

#4 ఆరెంజ్ :

ఈ కాషాయరంగు పాస్ పోర్ట్ అనేది, ఎవరు అయితే పదవ తరగతి కూడా పాస్ కాకుండా ఇతర దేశాలకు పని కోసం వెళతారో వాళ్ళ కోసం జారీ చేయబడుతుంది.

 


End of Article

You may also like