Ads
చాలామందికి పచ్చి మిరప కాయ అయినా, ఎర్ర మిరపకాయ అయినా కారం కోసమే కదా అనుకుంటారు. కానీ ఈ రెండింటిలోనూ అత్యధిక పోషక విలువలు ఉంటాయి. అంతేకాదు.. వీటిల్లో టేస్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. అయితే.. ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? అనే విషయానికి వస్తే మాత్రం మీరు ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే.
Video Advertisement
కొంతమంది ఎర్ర మిరపకాయలు పచ్చి మిరపకాయల కంటే నాణ్యమైనవని, ఎక్కువ కారం ఉంటాయని అనుకుంటూ ఉంటారు. ఈ రెండిటిలో ఏ మిరపకాయ తిన్నా ఆరోగ్య ఫలితాలు మెరుగ్గానే లభిస్తుంటాయి.
రెండు రకాల మిరప కాయలలోనూ క్యాప్సైసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది వాపు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడంలో కూడా క్యాప్సైసిన్ అనే పదార్ధం దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్ధం కొలెస్ట్రాల్ స్థాయిలు ,ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సాయం చేస్తుంది.
ఎర్ర మిరపకాయలలో బీటా కెరోటిన్ ,విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. ప్రేగులు, ఊపిరితిత్తులు, నాసికా మార్గాలు, మూత్రం మార్గాలలో రక్తం పేరుకు పోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. పచ్చిమిర్చిలో నీరు శాతం ఎక్కువ, జీరో కెలొరీస్ ఉంటాయి. బరువు తగ్గగలనుకునేవారు ఎరుపు మిర్చి కంటే.. పచ్చి మిర్చి వాడడం మేలు.
End of Article