చికెన్ షాపు నుంచి తెచ్చిన తరువాత వాష్ చేస్తే ప్రమాదమా..? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయరు..!

చికెన్ షాపు నుంచి తెచ్చిన తరువాత వాష్ చేస్తే ప్రమాదమా..? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయరు..!

by Anudeep

Ads

ఆదివారం వచ్చింది అంటే చాలు చాలా మంది ఇళ్లల్లో చేసుకునే వంటకం చికెన్. మార్కెట్ కు వెళ్లి చికెన్ ను తెచ్చుకుని.. దానిని శుభ్రంగా వాష్ చేసుకుని వంట చేసేస్తూ ఉంటారు. అయితే.. ఇలా చికెన్ ను వాష్ చేయచ్చా..? చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదమా..? మరి వాష్ చేయకుండా ఎలా వండాలి..? ఈ సందేహాలు అన్ని తీరాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే.

Video Advertisement

అసలు క్లీన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి..? అని చాలా మంది అడగొచ్చు. కానీ, చికెన్ ను ఇంటికి తెచ్చాక కడిగి వండడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది అని ఇప్పటికే చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికెన్ లేదా మాంసాన్ని ఇంటికి తెచ్చాక టాప్ కింద పెట్టి కడగడం వలన దానికి ఉండే బాక్టీరియా మన చేతికి అంటుకుంటుంది. ఆ తరువాత మనం ఆహరం తీసుకునేటప్పుడు ఇది మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగచేస్తుంది. పచ్చి కోడి మాంసం పై సాల్మోనెల్ల, క్యాంపిలోబ్యాక్టర్ వంటి బాక్టీరియాలు ఉంటాయి. టాప్ కింద ఈ చికెన్ ను పెట్టి కడగడం వలన ఆ నీరు చింది మన దుస్తులపైనా లేదంటే సింక్ పక్కన ఉన్న చాక్, ప్లేట్స్ వంటి వాటిపై పడే అవకాశం ఉంటుంది. తిరిగి ఆ ప్లేట్ లేదా, చాక్ ను మనం ఉపయోగించినప్పుడు ఈ బాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

క్యాంపిలోబ్యాక్టర్ ఫుడ్ పాయిజనింగ్ కి ప్రధాన కారణం. శుద్ధి చేయని కూరగాయలు, పాలు, పచ్చి మాంసం తీసుకోవడం వల్ల ఈ బాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. దీనివలన పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది గ్యాస్ సమస్యలు, డయేరియా, మలబద్ధకం లాంటి సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు. చాల అరుదుగా గ్యాంబరే సిండ్రోమ్ బారిన కూడా పడుతుంటారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తీ తగ్గి నాడి వ్యవస్థపై ప్రభావం పడుతుంటుంది. కొన్నిసారు ఈ బాక్టీరియా వలన ప్రాణాలు కూడా పోవచ్చు.

అందుకే మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్ ను వెంటనే కడగకుండా తగిన టెంపరేచర్ దగ్గర ఉడికించాలి. పైన రక్తపు మరకలు అపరిశుభ్రంగా కనిపిస్తే పేపర్ టవల్ తో తుడవాలి. ఆ పేపర్ టవల్స్ ను జాగ్రత్తగా పడేయాలి. అలాగే పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతర ఆహారపదార్ధాలతో కలవకుండా జాగ్రత్తగా ఉంచాలి. చికెన్ ముక్కలను కట్ చేయడానికి వాడే చాక్స్, గిన్నెలు, చికెన్ తయారీకి వాడిన ఇతర వస్తువులను కూడా శుభ్రంగా కడగాలి. మాంసం వండిన తరువాత చేతులను శుభ్రంగా కడుగుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా ఉండొచ్చు.


End of Article

You may also like