Ads
మనం ఒక చోటు నుండి వేరే చోటుకు ప్రయాణించడానికి ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి. అందులో మనందరం ఎక్కువగా వాడేది బస్, ట్రైన్, లేకపోతే ఫ్లైట్. ఇందులో చాలా మంది ట్రైన్ ప్రయాణాలను ఫ్లైట్ ప్రయాణాల ని ఇష్టపడతారు. అయితే బస్ లో కానీ, ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ ప్రయాణించేటప్పుడు మనం చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ ఉంటాం.
Video Advertisement
కానీ మనం కూర్చున్న బస్ ని కానీ, ట్రైన్ ని కానీ ఫ్లైట్ ని కానీ ఎక్కువగా పట్టించుకోము. మనం ఎన్నో సార్లు ట్రైన్ ఎక్కే ఉంటాము.. మనకి ట్రైన్ టైం కి అందుకోవాలి అన్న ధ్యాసే ఉంటుంది తప్ప..పరిసరాలపై దృష్టి నిలపలేము.
మీరెప్పుడైనా గమనించారా.. ట్రైన్ లో బెర్త్ ల పై విండో సీట్ వద్ద “W” అని రాసి ఉంటుంది. అలాగే.. కార్నర్ సీటు వద్ద “A” అని రాసి ఉంటుంది. అయితే.. ఇలా ఎందుకు రాసి ఉంటుంది అంటే ట్రైన్ ఎక్కడానికి వచ్చిన వారికి విండో సీట్ ఏదో క్లారిటీగా తెలియడం కోసం రాసి ఉంచుతారు. చాలా మంది ఇది ఒక్కటే గమనించుకుని వదిలేస్తారు. కానీ కార్నర్ సీటు లో రాసి ఉన్న “A” అనే అక్షరానికి మాత్రం అర్ధం ఏంటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
సాధారణంగా విండో సీటు ను “W” అని, మధ్యలోని సీటుని “M” అని, చివరిగా ఉన్న సీటుని “A” అని రాయిస్తారు. “A” అనగా అసైల్ అని అర్ధం. అసైల్ అంటే నడవడానికి వీలుగా ఉండే దారి అని అర్ధం. నడిచే దారికి పక్కగా ఉన్న సీటు కాబట్టే.. చివరిగా ఉన్న సీటుని అసైల్ సీటు అని పిలుస్తారు. ఇక స్లీపర్ క్లాస్ లోకి వచ్చే సరికి ఈ సీట్లను కాకుండా.. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని డివైడ్ చేస్తారు.
End of Article