ఇంట్లో బియ్యాన్ని ఈ దిక్కున పెడుతున్నారా? అయితే అన్నీ అప్పులే.. అసలెక్కడ పెట్టాలంటే?

ఇంట్లో బియ్యాన్ని ఈ దిక్కున పెడుతున్నారా? అయితే అన్నీ అప్పులే.. అసలెక్కడ పెట్టాలంటే?

by Anudeep

Ads

ఇల్లు కట్టాం అంటే.. వాస్తు ప్రకారం ఎన్నో లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఏ గది ఎక్కడ ఉండాలి.. ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి అన్న విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని పెట్టుకోవాలి. లేదంటే ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం.. ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోవడం, అప్పులు చేయాల్సి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.

Video Advertisement

సాధారణంగా ఇంటిలో వంటగదికి ప్రత్యేకంగా వాస్తు ఉంటుంది. అలాగే.. ఆ గదిలో పెట్టె వస్తువుల విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక వంట ఇంట్లో బియ్యం పెట్టడానికి కూడా ఓ వాస్తు నియమం ఉంది.

rice bag

అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనిషి ఏమి లేకపోయినా ఎలాగోలా బతుకుతాడు.. కానీ తినడానికి తిండి లేకపోతే బతకడమే కష్టం అవుతుంది. అందుకే బియ్యానికి అంత ప్రాధాన్యత ఉంది. వీటిని సరైన ప్లేస్ లో పెడితే.. ఇంట్లో అన్నపానాదులకు కొరత లేకుండా ఉంటుంది. చాలా మంది బియ్యం డ్రమ్ము లేదా బియ్యం సంచిని నైరుతి మూలన పెడుతూ ఉంటారు. నైరుతి మూలన బరువు ఉంచాలి అన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తుంటారు.

rice bag 1

దీని వలన లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. నైరుతి మూలన బరువు పెట్టాలి.. కానీ రోజూ తీసేవాటిని కాకుండా.. స్థిరంగా కదలకుండా ఉంచేవాటిని పెట్టాలి. కానీ బియ్యం మనం ప్రతిరోజు తీస్తూనే ఉంటాం. ఇలా అక్కడ బియ్యం పెట్టడం వలన ఇంటి యజమానికి అనారోగ్యం రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వంటివి జరుగుతాయి. బియ్యాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచుకోవాలి. ఇలా పెట్టడం వలన ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. గ్రహాలు అనుకూలించకపోయినా.. బియ్యాన్ని ఆగ్నేయ దిశలోనే పెట్టాలి. అప్పుడే కలిసి వస్తుంది.


End of Article

You may also like