Ads
ఇటీవల కాలంలో చాలా మందికి రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయి పెరగడం అనేది సాధారణంగా జరుగుతోంది. నిజానికి యూరిక్ ఆమ్లం అనేది శరీరంలోని రక్తంలో కలిసి ఉండి జీవక్రియలు సాయం చేస్తూ ఉంటుంది. అయితే.. ఈ యూరిక్ ఆమ్లం స్థాయి అవసరమైన దానికంటే ఎక్కువ అయినప్పుడే ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
Video Advertisement
ఫలితంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడడం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే మాత్రం కొద్దిగా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే.. మీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ ను చేర్చుకోవడం ఉత్తమం.
ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు బాదం పప్పులను తీసుకోవడం వలన ఈ యూరిక్ ఆమ్లం లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. బాదంపప్పు లో ఉండే జింక్,కాపర్,విటమిన్ కే, కాల్షియం, ఫైబర్,మెగ్నీషియం వంటివి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేయడంతో పాటు కీళ్ల నొప్పులను నివారించడంలో కూడా సాయం చేస్తాయి. అలాగే జీడిపప్పులో ఉండే పొటాషియం,విటమిన్ సి,ఫైబర్ వంటివి యూరిక్ స్థాయిలను తగ్గించడంతో పాటు చెడు కొలెస్టరాల్ ను తొలగించి మంచి కొలెస్టరాల్ ను పెంపొందించడానికి కూడా సాయం చేస్తాయి.
ఇక వాల్ నట్స్ లో ఉండే ఒమేగా-3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని యూరిక్ ఆసిడ్ లను బయటకు పంపడానికి దోహదం చేస్తాయి. రోజుకు రెండు వాల్ నట్స్ ను తిన్నప్పటికీ అవి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అవిసె గింజలు కూడా మేలు చేస్తాయి. వీటిల్లో శరీరం కూడా ఉత్పత్తి చెయ్యలేని కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి యూరిక్ ఆమ్లం అధికంగా ఉండడం వలన కలిగే నొప్పిని నివారిస్తాయి.
End of Article