Ads
నేరేడు పండ్లు అందరికి ఇష్టమైనవే. కొంచం వగరుగా ఉంటూ.. తినగానే అదోరకమైన తృప్తిని కలిగిస్తాయి ఇవి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు. వీటివల్ల చాలానే లాభాలు ఉన్నాయండోయి. అయితే.. ఇవి ఎక్కువగా సమ్మర్ సీజన్ లోనే దొరుకుతూ ఉంటాయి. ఇవి దొరికినప్పుడే తినాలి. సంవత్సరానికి ఒక్కసారి అయినా నేరేడు పండ్లను తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
Video Advertisement
నేరేడు పండు బయటి పొర నలుపు లేదా ముదురు ఊదా రంగులో కనిపిస్తుంది, ఇది పుల్లని మరియు ఆస్ట్రింజెంట్ అండర్ టోన్‌లతో ప్రత్యేకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. నేరేడు పండ్లు యాంటీ-స్కార్బుటిక్ మరియు కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
గుండె, కీళ్లనొప్పులు, ఉబ్బసం, కడుపు నొప్పి, అపానవాయువు మరియు విరేచనాలకు సంబంధించిన సమస్యలను ట్రీట్ చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో ఇటువంటి వ్యాధులను నయం చేసేందుకు తయారు చేసే మందులలో నేరేడు పండ్లను ఉపయోగిస్తారు. ఇవి మూత్రపిండాలు శుద్ధి చేస్తాయి. మూత్ర పిండాలలో ఉండే వ్యర్ధ పదార్ధాలను, ప్రేగుల లోపలే మిగిలిపోయిన వ్యర్ధాలను నేరేడు పండ్లు సులువుగా బయటకు పంపించడంలో సాయం చేస్తాయి.
నేరేడు పండ్లలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియలో సాయం చేస్తుంది. అంతే కాదు.. వికారాన్ని, వాంతులను కూడా నిరోధిస్తుంది. హైపర్‌గ్లైకేమియా లేదా హై బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలో కూడా నేరేడు ప్రభావ వంతంగా పని చేస్తుంది. పండు కాకుండా, విత్తనాలు, ఆకులు మరియు బెరడు నుండి సేకరించిన పదార్దాలు కూడా శరీరంలో చక్కెరను అదుపులో ఉంచడానికి దోహదం చేస్తాయి. దీనిని నేరుగా తినేయవచ్చు.. లేదా జ్యూస్, స్మూతీస్ వంటి వాటిని తయారు చేసుకుని కూడా సేవించవచ్చు.
End of Article