Ads
అనారోగ్యాన్ని అంచనా వేయడానికి మనకు ఎన్నో విధాలుగా మార్గాలు ఉన్నాయి. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్లు మన కళ్ళు, నాలుకతోపాటు గోళ్లను కూడా పరీక్షగా చూస్తూ ఉంటారు. ఇలా చూడడం అనే విషయం చాలామంది ఒక్కోసారి గమనించే ఉంటాం.
Video Advertisement
అసలు గోళ్లని బట్టి మన ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారు. గోళ్ళు మన ఆరోగ్యానికి ఎలా ఆనవాళ్లుగా ఉంటాయి. అనారోగ్యాన్ని గురించి తెలిపే గోళ్ళను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన చేతి గోళ్ళను బట్టే మన ఆరోగ్యం ఎలా ఉందో అని చేపవచ్చు అంటున్నారు డాక్టర్స్. అందరి చేతిగోళ్లు ఒకే విధంగా ఉండవు. కొందరికి గోళ్ల మీద తెల్ల తెల్లని మచ్చలు ఉంటాయి. మరికొందరికి గోళ్ళు వేరు వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి.
అయితే గోళ్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. ఈ ఆకారం అని లునులా అని అంటారు. ఈ లునులాలో అందరి గోళ్లపై ఒకే విధంగా ఉండవు. కొందరికి చిన్నవిగాను, కొందరికి పెద్దవిగాను, మరికొందరికి అస్సలు లేకుండా కూడా ఉంటుంది.
ఎవరికైతే లునులాలు పెద్దవిగా ఉంటాయో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అని వైద్యులు వెల్లడిస్తున్నారు. వీరిలో థైరాయిడ్ గ్రంథులు, జీర్ణశక్తి, కాలేయం సక్రమంగా పని చేస్తున్నాయని అర్థం.
ఎవరికైతే లూనులా చిన్నవిగా ఉంటాయో వారిలో అజీర్ణ సమస్య అధికంగా ఉంటుంది. వీళ్లకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీరు రక్తప్రసరణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
చేతి గోళ్ళ మీద లునులా లేకపోతే లేనివారు రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్ల హెచ్చుతగ్గులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీరు జుట్టురాలడం, బరువు పెరగడం మరియు మానసిక ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలకు గురి అవుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా కొందరికీ గోళ్ల మీద తెల్లని మచ్చలు కనబడుతుంటాయి. అవి కొన్ని రోజుల తర్వాత కనుమరుగవుతాయి. గోళ్లపై ఇలా తెల్లని మచ్చలు కనబడడానికి గల కారణం ఏంటంటే.. వారు శరీరానికి తగినంత ఆహారం తీసుకోవటం లేదని అర్థం. వీళ్ళలో రక్తహీనత వలన కాల్షియం మరియు జింక్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.
కొందరి గోళ్లు పసుపు రంగులోకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా గోళ్లు పసుపు రంగులోకి కనిపించేవారు చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు కాలేయ వ్యాధులతో బాధపడుతుంటారు. మరికొందరి గోళ్లపై నల్లటి పొడవైన గీతలు ఉంటాయి. ఇలాంటి వారు మోలనోమా అనే చర్మ క్యాన్సర్ గురి అవుతారని సంకేతం.
మన చేతి వేళ్ళలో ఉన్న పది గోళ్లలో కనీసం ఎనిమిది గోళ్ళ కైనా లునులా కచ్చితంగా ఉండాలి. ఎనిమిది కంటే తక్కువ లునులా ఉన్నవారిలో కాల్షియం లోపం మరియు ప్రోటీన్ల లోపం ఉందని, అంతేకాకుండా వాళ్లకు శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందటం లేదని అర్థం. ఇలాంటి వారు శరీరానికి ప్రతి రోజూ పౌష్టికాహారం అందించడంతో పాటు వ్యాయామం కూడా చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
End of Article