Ads
భారతీయులలో ముఖ్యంగా హిందువులలో ఆవుకు ఎంతటి పవిత్ర స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారని హిందూ పురాణాలు ఘోషిస్తూ ఉంటాయి. హిందూ పురాణాలలో ఆవుకు ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టే హిందువులు కూడా ఆవుని గౌరవిస్తూ.. పూజిస్తూ ఉంటారు. ఇంటి ముందుకు ఏదైనా ఆవు వస్తే.. దానికి తినడానికి ఏమైనా పెట్టడం, పూజించడం వంటివి చేస్తుంటారు.
Video Advertisement
గోవు పాదాల్లో పితృదేవతలు, తోకలో లక్ష్మి దేవి, అడుగులలో ఆకాశగంగ, కడుపులో కైలాసం, పాల పొదుగులో చతుర్వేదాలు.. ఇలా ఒక్కో చోట ఒక్కో దేవత కొలువై ఉంటారని.. ఆవుకి ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని చెబుతుంటారు.
అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడే గోవుని పూజించి గోపాలుడు అయ్యాడు. కాబట్టి సామాన్యులమైన మనము కూడా గోవుని పూజిస్తూనే ఉండాలి. గోవుని పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. మన ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే.. మనకి మంచి రోజులు రాబోతున్నాయని అర్ధమట. సకల దేవతలు కొలువై ఉన్న గోవులు మన ఇంటి ముందుకు వస్తే.. సకల దేవతలు మన ఇంటి ముందుకు వచ్చినట్లు అవుతుంది.
ఇలా ఇంటి ముందు గోవు నిలబడినప్పుడు.. ఆ గోవుకు కొంత పశు గ్రాసం, శనగలు, బెల్లం వంటి వాటిని పెట్టి గోవుని తృప్తి పరచాలి. తరువాత గోవు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా గోవులను సేవించడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పనులలో ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నా.. అవన్నీ తొలగి అన్ని శుభాలే జరుగుతాయి.
End of Article