Ads
సమాజంలో నాస్తికులతో పాటు ఆస్తికులు కూడా ఉంటారు. దేవునిపై ఎటువంటి నమ్మకం లేని వారిని నాస్తికులు అని పిలిస్తే.. నమ్మకం కలిగిన వారిని ఆస్తికులు అని అంటాం. దేవుని పట్ల నమ్మకం ఉన్న వారు తమ ఇబ్బందులను దేవునితోనే చెప్పుకుంటూ ఉంటారు. తమని కష్టాల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే.. మనసులో ఏదైనా కోరికని కోరుకుంటే.. దానిని మరెవ్వరికీ చెప్పకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దలు ఏమి చెప్పినా దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.
అలాగే.. మనం దేవుడిని కోరుకున్న కోరికల గురించి ఎవరికీ చెప్పకూడదు అన్న విషయంలో కూడా ఉండే మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగానే మన చుట్టూ మంచి, చెడు రెండూ ఉంటాయి. కొందరు మనకి మంచి జరగాలని కోరుకుంటే.. మరికొందరు మనం జీవితంలో పైకి రాకూడదని.. వారి కంటే తక్కువ స్థాయిలోనే ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒకరకమైన స్వార్ధం కావచ్చు.
అయితే.. మనం మన జీవితం బాగుండాలని, లేదా మనం చేయబోయే పనులలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉండడంలో తప్పులేదు. ఇలా అందరు కోరుకుంటూనే ఉంటారు. కానీ మనం దేవుడిని దేని గురించి అయితే కోరుకుంటామో.. దానిని ఇతరులకు చెప్పడం వలన.. వారు ఒకవేళ మన కీడు కోరుకునే వారు అయితే.. మన కోరిక నెరవేరకూడదు అని భావిస్తారు. దీనివలన మన చుట్టూ నెగటివ్ ఆరా ఏర్పడుతుంది. లేదా వారు బలవంతులైతే.. మన కోరిక తీరకుండా చేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ఫలితంగా నష్టపోయేది మాత్రం మనమే. అందుకే దేవుడిని కోరుకున్నకోరికల గురించి ఇతరులకు చెప్పకూడదని అంటుంటారు.
End of Article