గర్భవతి అయిన మహిళలకి 7 వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు? అసలు కారణం ఏంటంటే?

గర్భవతి అయిన మహిళలకి 7 వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు? అసలు కారణం ఏంటంటే?

by Anudeep

Ads

ఏ అమ్మాయికైనా అమ్మతనం అనేది వరం. వద్దు అనుకునే వారి సంగతి పక్కన పెడితే.. కావాలని కోరుకునే వారు తాము గర్భవతి అయ్యామని తెలియగానే మురిసిపోతారు. ఆమె భర్త తో పాటు కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో సందడి చేస్తారు.

Video Advertisement

భార్య గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే.. గర్భవతి అయిన మహిళకు ఏడవ నెలలో సీమంతం చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది.

pregnancy 3

అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు ఐదవ నెలలో, మరికొందరు తొమ్మిదవ నెలలో కూడా చేస్తూ ఉంటారు. వారి వారి పరిస్థితులను బట్టి ఈ సీమంతంను చేస్తూ ఉంటారు. అయితే.. అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతం ఎందుకు చేయాలి..? దీని వెనుక అసలు కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గత జన్మలో పుణ్యం చేయడం వల్లే ఈ జన్మలో మానవ జన్మ లభిస్తుంది.

baby shower 1

అయితే.. లభించిన మానవ జన్మకి షోడశ సంస్కారాలను చేయాలనీ అంటుంటారు. వీటిల్లో కొన్నిటిని జనన పూర్వ సంస్కారాలని, మరి కొన్నిటిని జనాంతర సంస్కారాలని అంటుంటారు. గర్భంలో ఉండగానే.. బిడ్డ బయటకు రాకముందే చేసే సంస్కారాన్ని సీమంతం అంటారు. ఇది మూడవ సంస్కారం. మొదటి రెండు సంస్కారాలను గర్భాదానం, పుంసవనంగా పేర్కొంటారు. తల్లి సౌభాగ్యంగా ఉండాలని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా.. ఎటువంటి సమస్యలు లేకుండా పుట్టాలని కోరుకుంటూ ఈ సీమంతాన్ని వేడుకగా జరిపిస్తారు. అలాగే గర్భిణీ మానసికంగానూ, శారీరకంగాను ఆహ్లాదంగా ఉండడం కోసం కూడా ఈ వేడుకని జరిపిస్తారు.


End of Article

You may also like