Ads
కర్మ ఫల దాత శని. శని దేవుడు మనం చేసే పాపపుణ్యాలను బట్టి కర్మఫలాన్ని ఇచ్చి సక్రమమైన మార్గంలో నడిచే విధంగా చేస్తారు. శని దేవుడు ఏప్రిల్ 29న కుంభ రాశిలో ప్రవేశించారు.
Video Advertisement
ఇప్పుడు శనిదేవుడు మరోసారి తన రాశి స్థానాన్ని మార్చుకోబోతున్నారు. శని దేవుడు తన స్థాన భ్రమణంలో కుంభరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు.
శని దేవుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జులై 12వ తేదీన శని దేవుడు కుంభ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించి రాబోయే సంవత్సరం 2023 జనవరి 17 వరకూ ఉంటాడని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకోవడం ద్వారా ప్రధానంగా మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి ఈ 3 రాశులపైన ప్రభావం చూపుతారు.
#1. మేష రాశి :
శనిదేవుని ప్రభావం వల్ల మేష రాశి వారికి అనారోగ్య బాధలు తలెత్తుతాయి. అదేవిధంగా ధననష్టం కూడా కలుగుతుంది. రాశి వారి ఆరోగ్యం మరియు సంపద పై జాగ్రత్త వహించాలి. ప్రతీ శనివారం ఆంజనేయస్వామి ఆరాధన చేయడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చు.
#2. సింహ రాశి :
సింహ రాశికి వారికి అమ్మ ఉద్యోగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే సింహ రాశి వారు మంగళవారం ఆంజనేయస్వామికి, శనివారం శని దేవునికి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది.
#3.ధనుస్సు రాశి :
ఈ రాశి వారు ఎంత కష్టపడి పని చేసినా సరైన ఫలితాలు రావు. తద్వారా మానసిక ఒత్తిడికి లోనయి ఆరోగ్యం క్షీణించి అవకాశం ఉంది. ఏ పని మొదలు పెట్టినా తొందరపడి నిర్ణయాలు తీసుకోక పోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. ఈ దనస్సు రాశి వారు ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు కలిగి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
End of Article