మీరు డయాబెటిస్ మరియు అధిక బరువుతో బాధపడుతున్నారా..! అయితే ఈ రెసిపీ ట్రై చేయండి..!

మీరు డయాబెటిస్ మరియు అధిక బరువుతో బాధపడుతున్నారా..! అయితే ఈ రెసిపీ ట్రై చేయండి..!

by Anudeep

Ads

ప్రస్తుత కాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే అనేక సమస్యలకు లోనవుతున్నారు యువత. సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

ఈ అధిక బరువుకు తోడు అనేక ఆరోగ్య సమస్యలకు కూడా గురి అవుతున్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వలన రక్తంలో ఇన్సులిన్ శాతం ఎక్కువై మూడు పదుల వయసులోనే డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

 

ఎప్పుడైతే మన శరీరానికి మంచి పోషకాహారం అందుతుందో మన అధిక బరువు నీ మరియు డయాబెటిస్ సమస్య అదుపులో పెట్టుకోవచ్చు. మరి ఈ సమస్య నుంచి బయట పడడానికి వారానికి రెండుసార్లు, రాగులు, జొన్నలు వంటివి తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

అధిక బరువును తగ్గించి డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి.

ఈ జొన్న ఇడ్లీ అనేది అధిక బరువు మరియు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అదేవిధంగా ఎముకలు కూడా ఎంతో మంచి బలాన్ని అందిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలు కంట్రోల్లో ఉంచి డయాబెటిస్ ని తగ్గుముఖం పట్టిస్తుంది.

జొన్న ఇడ్లీ తయారీ విధానం:

విడివిడిగా ఒక కప్పు మినపగుళ్ళును, మూడు కప్పుల జొన్నరవ్వ ను బాగా కడిగి నాలుగు ఐదు గంటల వరకు నీటిలో నానబెట్టుకోవాలి. నానిన మినప గుళ్ళు మెత్తగా పలుచని పిండిలా రుబ్బుకోవాలి.

గ్రైండ్ చేసిన మినప పిండి లో నానబెట్టిన జొన్నరవ్వ ను కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసి రెండు గంటల వరకు అలా వదిలేయాలి.

ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెం నూనె రాసి, కలిసిన ఈ పిండిని ఇడ్లీల వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికించాలి.

జొన్న రవ్వతో చేసిన ఇడ్లీ వారానికి రెండు సార్లైనా తీసుకుంటే అధిక బరువుతో మరియు డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఎంతో మేలు చేస్తుంది.

 


End of Article

You may also like