ఫోన్ సైలెంట్ లో పెట్టి.. ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? అయితే ఈ ట్రిక్ తో కనిపెట్టండి!

ఫోన్ సైలెంట్ లో పెట్టి.. ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? అయితే ఈ ట్రిక్ తో కనిపెట్టండి!

by Anudeep

Ads

స్మార్ట్ ఫోన్ వచ్చాక మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. చాలా పనులను మనం ఫోన్ లోనే పూర్తి చేసుకుంటూ ఉంటున్నాం. ముఖ్యమైన డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్.. ఇలా మన ఫోన్ లోనే ఉంటాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే మనకి ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి వచ్చేసింది.

Video Advertisement

అయితే.. పొరపాటున స్మార్ట్ ఫోన్ పోతే..? ఎక్కడో పోతే మనం చేసేది ఏమీ ఉండదు కొత్త ఫోన్ కొనుక్కోవడం తప్ప. కానీ.. ఫోన్ ను ఇంట్లోనే పెట్టి.. ఎక్కడ పెట్టామో మర్చిపోతే?

mobile phone 2

రింగ్ ఇస్తే కనపడుతుందిగా అని అంటారా..? మరి ఆ ఫోన్ సైలెంట్ లో ఉంటె ? కష్టమే కదా.. ఫోన్ ఇంట్లోనే ఉండి.. ఎక్కడ ఉందొ తెలియకపోతే వచ్చే ఇబ్బంది మాములుగా ఉండదు. అది సైలెంట్ లో ఉండి ఉంటె ఎక్కడ ఉందొ వెతుక్కోవడం కూడా కష్టం అయిపోతుంది. ఇలాంటప్పుడే ఓ చిన్న ట్రిక్ తో మీ ఫోన్ ఎక్కడ ఉందొ వెతికేయచ్చు.

mobile phone 1

మీ లాప్టాప్ లేదా మరో ఆండ్రాయిడ్ మొబైల్ లో జిమెయిల్ లో లాగిన్ అవ్వండి. మీ ఫోన్ లో ఏ జిమెయిల్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో.. లాప్టాప్ లో కూడా అదే జిమెయిల్ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. తర్వాత గూగుల్ లో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్సైటు ఓపెన్ చేయాలి. మీ మొబైల్ ఎక్కడ ఉందొ కనిపిస్తుంది. ఇంకా ఫోన్ కు సంబంధించిన బాటరీ, నెట్వర్క్, ఫోన్ పేరు కనిపిస్తాయి. అక్కడే ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేస్ డివైస్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్లే సౌండ్ డివైస్ ను క్లిక్ చేస్తే మీ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉందొ గుర్తుపట్టొచ్చు. మీ ఫోన్ పోయినప్పుడు కూడా లొకేషన్ కోసం ఇలా ట్రై చేయవచ్చు. కానీ మీ ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.


End of Article

You may also like