Ads
ఈమధ్య ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన చాలా ఎక్కువనే చెప్పవచ్చు. తన ఆరోగ్యం కోసం అనేక రకాల ఆహార నియమాలు పాటిస్తున్నారు . తమ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మన మార్కెట్లోకి దిగుబడి అనేక రకాల పండ్లను తింటూ ఉంటారు. అందులో లీచీ పండు ఒకటి.
Video Advertisement
లీచీ ఫ్రూట్ మనకి సమ్మర్ లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ ఫ్రూట్ మనకి చైనా నుంచి దిగుబడి అవుతుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, సిట్రిక్ ఆసిడ్, ఐరన్ అధికంగా లభిస్తాయి. ఈ పండు చూడడానికి స్ట్రాబెరీ లా కనిపిస్తుంది. తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.
రుచికి తగ్గట్లు ఈ పండులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పండు వలన ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
#1. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది :
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.
#2. మెరుగైన జీర్ణవ్యవస్థ :
ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ క్రమంగా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
#3. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:
ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి వలన శరీరంలోని బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.
#4. రక్తహీనతను తగ్గిస్తుంది:
రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి లీచీ పండు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే కాపర్, ఇనుము శరీరంలోని రక్తకణాలను పెంచుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యలు తగ్గిస్తుంది.
#5. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది :
చిన్న వయసులోనే ముడతల సమస్య బాధపడుతున్న వారికి లీచీ పండు మంచి ఔషధంగా పనిచేస్తుంది. లీచీ పండు తినడం వల్ల దానిలో ఉండే విటమిన్ సి చర్మంలో ఉండే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మరియు ముడతలు లేకుండా చేయడానికి దోహదపడుతుంది.
#6. అధిక బరువును తగ్గిస్తుంది :
లీచీ పండులో ఉండే ఫైబర్ కొవ్వును తొలగించేందుకు దోహదం చేస్తుంది. మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి పోషకాలు లీచీ పండులో పుష్కలంగా ఉండటం వలన ఎముకలు దృఢం గా మార్చి, శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
End of Article