ఇంటి పెద్ద లో ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి… లేకుంటే కుటుంబం నాశనమే.. అవేంటంటే?

ఇంటి పెద్ద లో ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి… లేకుంటే కుటుంబం నాశనమే.. అవేంటంటే?

by Anudeep

Ads

ఆచార్య చాణిక్యుడు ఎంతో గొప్ప పండితుడు మరియు తెలివైన వ్యక్తిత్వం కలవాడు. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. కుటుంబ పెద్ద  ఏవిధంగా ఉండాలో అని తన నీతి శాస్త్రంలో సమాచారమిచ్చారు చాణిక్యుడు.

Video Advertisement

ఒక కుటుంబం ఎదగాలన్న, నాశనం అవ్వాలన్న అది ఆ ఇంటి నాయకత్వం వహించే పెద్ద మీద ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఎప్పుడైతే ఇంటి యజమాని సక్రమమైన మార్గాన్ని చూపిస్తారో..  ఆ కుటుంబం ఉన్నత స్థితికి వస్తుందని, లేకపోతే అంధకారం ఏర్పడి  కుటుంబం నాశనం అవుతుందని చాణిక్యనీతి లో చెప్పబడింది.

ఇవి కూడా చదవండి: గణపతి విగ్రహాల్లో తొండం కొన్నిటికి కుడివైపున, కొన్నిటికి ఎడమవైపున ఎందుకు ఉంటుంది..? వాటి అర్థమేమిటి?

ఇప్పుడు ఇంటి పెద్దలు ఏ లక్షణాలు ఉండటం ద్వారా ఆ కుటుంబం నాశనం కాకుండా ఉంటుందో తెలుసుకుందాం…

#1. సమస్య :

ఆచార్య చాణిక్య నీతి ప్రకారం కుటుంబ పెద్ద, కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. ఏ సమస్య వచ్చిన మీరు ఉన్నారని భరోసా వాళ్ళలో కలగాలి. ఎప్పుడైతే ఇంటి యజమాని సమస్యలను పట్టించుకోకుండా వుంటారో ఆ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.

#2. మంచి సంబంధం :

ఆచార్య చాణక్యుని నీతి ప్రకారం ఇంటి పెద్ద తన సోదరులు మరియు సోదరీమణులు తో ఎప్పుడూ మంచిది ప్రేమానుబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులతో మీకు సంబంధం లేకుండా ఉంటారో మీ కుటుంబం చెడు మార్గం వెతుక్కునే ప్రమాదముంటుంది. మీ సోదరుడు లేదా సోదరి ఏదైనా తప్పు చేస్తే వెంటనే దండించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే వారధిలా నిలుస్తారు.

#3. ఆహారం :

ఇంటి యజమాని ఎప్పుడూ ఆహారాన్ని అవమానించకూడదని చాణిక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే పిల్లలు కూడా తమ పెద్దలు చేసే పని అనుసరిస్తారు. ఎప్పుడైతే పిల్లలు ఇంటిలోని ఆహారాన్ని అవమానించడం ప్రారంభిస్తారో, ఆ ఇంటిలోని ఆనందం మరియు శ్రేయస్సు దూరమవుతుంది.

#4. డబ్బు :

ఇంటి పెద్ద ఎల్లప్పుడూ  పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఆలోచిస్తుండాలి. వాళ్ల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికను నిర్మించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కుటుంబసభ్యుల ముందు డబ్బు వృధా చేయకూడదు. పొదుపు అనేది వాళ్లకు అలవాటు చేయాలి.

 

ఇవి కూడా చదవండి: వినాయకుడి ముందు మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు..? దీనివెనుక ఇంత కథ ఉందా..?


End of Article

You may also like