పాదాల వాపుతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ చిట్కాలతో మీ వాపు సమస్యలు తగ్గించుకోండి..!

పాదాల వాపుతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ చిట్కాలతో మీ వాపు సమస్యలు తగ్గించుకోండి..!

by Anudeep

Ads

ఒక్కోసారి మనం ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు మన పాదాలు వాపులకు గురవుతాయి. అంతేకాకుండా ఎక్కువగా కూర్చుని పనిచేసే వారికి లేదా నిలబడి పని చేసే వాళ్ళకి పాదాల వాపులు వస్తూ ఉంటాయి.ఇది కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

Video Advertisement

అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా కొందరు కాళ్ల వాపు సమస్యను ఎదుర్కొంటారు.  ఇది బిడ్డను జన్మ ఇచ్చే వరకే ఉంటుంది తర్వాత కాళ్లు వాపు  అనేవి సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

అలాకాకుండా కొంతమందికి ఆరోగ్య సమస్యల ద్వారా నిత్యం కాలు వాపులతోనే ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఇన్ఫెక్షన్లు, కీళ్ళవాపు వంటి వ్యాధులతో  దీర్ఘకాలిక వాపు  సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ పాదాల వాపు సమస్యనే ఎడీమా అని కూడా అంటారు.

ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఈ కాళ్లవాపు తగ్గుముఖం పడుతుంది.

అది ఆ చిట్కాలేంటో ఒకసారి మనం కూడా తెలుసుకొని పాటిద్దాం..

#1.

పాదాలు వాపు ఉన్నవారు నిద్రపోయే సమయంలో పాదాల కింద తులా ఎత్తుగా ఉండేలా ఏదైనా మెత్తని వస్తువుని గాని, దిండు ను గాని ఉంచుకోవాలి. ఇలా పాదాలు ఎత్తులో పెట్టుకోవడం వల్ల మీ పాదాలలో  వచ్చిన నీరు అనేది తగ్గుముఖం పడుతుంది.

#2.

Hot water

పాదాల వాపు ఎక్కువగా బాధ పడుతున్నారు అర బకెట్లు ఉప్పు నీళ్లలో పాదాలను పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉంచడం ద్వారా కాళ్లలోని వాపుని, మజిల్స్ పెయిన్ వంటివి తగ్గుముఖం పట్టిస్తుంది.

#3.

Oil massage

నువ్వుల నూనెతో వాపు ఉన్న మీ పాదాల మీద మసాజ్ చేయడం ద్వారా మీ కాళ్ళ రక్త సరఫరా బాగా జరిగి కళ్ళలోని నీటి శాతాన్ని తగ్గించి వాపును తగ్గిస్తుంది.

#4.

Barley water

రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల బార్లీ గింజలు వేసి బాగా మరిగించాలి. దానిలో చిటికెడు ఉప్పు కలుపుకొని ఆ నీటిని త్రాగాలి. ఇలా చేయడం ద్వారా మీ ఒంటి లో ఉన్న అధిక నీరు మూత్రం ద్వారా బయటకు పోయి వాపులను తగ్గుముఖం పడుతుంది.

వాపు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

 


End of Article

You may also like