రైలు పట్టాలపై కంటే.. వంతెనపై ప్రయాణించేటప్పుడు ఎందుకు ఎక్కువ శబ్దం వస్తుంది? అసలు కారణం ఇదే!

రైలు పట్టాలపై కంటే.. వంతెనపై ప్రయాణించేటప్పుడు ఎందుకు ఎక్కువ శబ్దం వస్తుంది? అసలు కారణం ఇదే!

by Anudeep

Ads

మీరు చాలాసార్లు రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు అనేకసార్లు వంతెనలపై నుంచి ప్రయాణం చేసినట్లు మీకు గుర్తుందా . కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించి ఉండరు. అదేంటంటే నేల మీద కన్నా, రైలు వంతెన పై వెళ్లేటప్పుడు ఎక్కువ శబ్దం చేస్తుంది. మీరు అనేక సార్లు రైలు ప్రయాణం చేసిన ఈ విషయాన్ని దృష్టిలో కి వచ్చి ఉండదు.

Video Advertisement

మరి రైలు నేల మీద ప్రయత్నించినప్పటికీ, వంతెన మీద ప్రయత్నించినప్పటికీ శబ్దంలో గల తేడా ఎందుకు అని అనుకుంటున్నారా.. ఇప్పుడు మనం ఆ విషయం గురించే తెలుసుకోబోతున్నాము.

Also read : ట్రైన్” లో మూవీ షూటింగ్ కి ఎంత తీసుకుంటారో తెలుసా..? ఎంత సమయానికి ఛార్జ్ చేస్తారంటే?

Train

రైలు ఎంతో బరువుగా ఉంటుంది దీన్ని డైనమిక్ లోడింగ్ అంటారు. వంతెన పై వెళ్తున్నప్పుడు రైలు బరువు వలన వంతెన ఎక్కువగా ప్రకంపిస్తుంది. వంతెన ఫ్రేమ్ ను క్రింద స్తంభాలకు బిగించినప్పటికి, ఆ ఇనుప ఫ్రేమ్ లో అధిక భాగానికి డ్యాంపింగ్ ఉండదు. అందుకే మనకి రైలు వంతెన పై వెళ్తున్నప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి కారణంగా వంతెన యొక్క ప్రకంపనలు ఏర్పడతాయి.

Also read: మీరు అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంటె.. ఆ టైం లో ట్రైన్ డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటె ఏమి చేయాలి..?

అదే భూమి మీద అయితే అంత శబ్దం రాదు. ఎందుకంటే భూమి మీద రైలు వెళ్తున్నప్పుడు ఆ పట్టాలు యొక్క ప్రకంపనలను క్రింద అమర్చిన సిమెంట్ స్తంభాలు  వాటి క్రింద వేసిన కంకర రాళ్ళ గుట్ట స్తంభాల మధ్యలో అమర్చే విధంగా పోస్తారు . దానితో పూర్తి ఘర్షణ జరిగి మనకు ఎక్కువ శబ్దం వినపడదు.

పట్టాల మధ్యలో ఏర్పడిన చిన్న ఖాళీల పై నుండి రైలు చక్రం వెళ్ళినప్పుడు వచ్చే డక్-డక్ శబ్దం. ఆ ఖాళీలు లేనప్పుడైతే రెండు ఇనుప ముక్కలను ఒకదానిపై ఒకటి గీస్తే వచ్చిన శబ్దంలాగా ఉంటుంది. ఇంకా క్రాసింగ్ వద్ద పట్టాలు మారుతున్నప్పుడు వచ్చే శబ్దం.

Also Read: వంతెనపై ఉన్నప్పుడు చైన్ లాగితే…ట్రైన్ తిరిగి కదలాలంటే ఇంత కష్టమా.?

బోగీలకు ఉండే బఫర్లు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు వచ్చే శబ్దం కంటే వంతెన మీద వెళ్తున్నప్పుడు ఈ శబ్దాలతో పాటు, డైనమిక్ లోడింగ్ వలన వచ్చే ప్రకంపనల శబ్దం అధికంగా ఉండడం వలన మనకి ఎక్కువ శబ్దం వస్తుంది.


End of Article

You may also like