Ads
రెవల్యూషనరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపు తో అందరిని ఆకర్షించాడు. వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనలో మరో కోణాన్ని చూపించాడు గోపీచంద్.
Video Advertisement
అయితే కెరీర్ పరంగా గోపిచంద్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘యజ్ఞం’ సినిమానే. అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాడు గోపిచంద్. ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, చాణక్య, పంతం వంటి డిజార్డర్ సినిమాలో తన ఖాతాలో ఉన్నాయి.
ఈ మధ్య వచ్చిన సీటీమార్ కొంత పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో “పక్కా కమర్షియల్‘ తో జులై 1 న ప్రేక్షకుల ముందు రానున్నాడు గోపిచంద్. ఇందులో హీరోయిన్ గా రాశిఖన్నా నటించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీ తొలి సంపాదన ఎంత అని యాంకర్ ప్రశ్నించగా జయం మూవీకి తేజ గారు పదకొండు వేలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు.
వాటిని ఎలా ఖర్చుపెట్టారు అని అడిగితే.. వాటిని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాలేదు. తేజ గారి లక్కీ నంబర్ 11 అంటా అందుకే 11 వేలు ఇచ్చారు, అలా అయితే దాని పక్కన ఇంకో సున్నా ఉండొచ్చు కదా అని సరదాగా చెప్పుకొచ్చారు గోపిచంద్. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ శ్రీవాస్ తో మరో చిత్రం చేసునున్నాడు గోపిచంద్.
End of Article